Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్యతో పింక్ రీమేక్?

బాలయ్యతో పింక్ రీమేక్?

బాలీవుడ్ లో పెద్ద హిట్ అయిన సినిమా. తమిళ్ లో అజిత్ రీమేక్ చేస్తున్న సినిమా పింక్. అమితాబ్ చేసిన పాత్రనే అజిత్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా తీసే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా హక్కులు నిర్మాత దిల్ రాజు దగ్గర వున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాను తెలుగులో బాలయ్య కీలక పాత్రలో రీమేక్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

అమితాబ్, అజిత్ చేసిన ఈ పాత్రకు సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎవరైనా బానే వుంటుంది. అయితే దిల్ రాజుకు మనసులో బాలయ్యతో ఓ సినిమా ఎప్పటికైనా చేయాలనే కోరిక వుండిపోయింది. ఆ కోరిక ఈ సినిమాతో తీర్చుకుంటే ఎలా వుంటుంది? అని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏడాదికి ఆరు సినిమాలు కనీసం చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. అందులో భాగంగానే వచ్చే ఏడాది ప్రాజెక్టుల్లో ఈ సినిమాను చేర్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఓకె అంటే కనుక పింక్ సినిమా ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బాలయ్య ఈ సినిమాకు ఓకె అనకపోతే, అప్పుడు మరో ప్రాజెక్టు ఏదయినా బాలయ్యతో చేయాలనే ఆలోచన కూడా దిల్ రాజుకు వున్నట్లు తెలుస్తోంది.

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?