బాలయ్య-క్రిష్..ఎవరిది తప్పు?

ఏమిటి ఇండస్ట్రీ కబుర్లు అని టాలీవుడ్ లో ఎవర్ని కలిసి ఎవరు ప్రశ్నించినా, వినిపించే గుసగుస ఏమిటంటే, గౌతమీ పుత్ర శాతక్ణర్ణి విషయంలో ఎదో జరుగుతోందని. ఏమిటీ సంగతి అని ఆరా తీస్తే, ఒకటి…

ఏమిటి ఇండస్ట్రీ కబుర్లు అని టాలీవుడ్ లో ఎవర్ని కలిసి ఎవరు ప్రశ్నించినా, వినిపించే గుసగుస ఏమిటంటే, గౌతమీ పుత్ర శాతక్ణర్ణి విషయంలో ఎదో జరుగుతోందని. ఏమిటీ సంగతి అని ఆరా తీస్తే, ఒకటి కాదు చాలా గుసుగుసలు వినిపిస్తున్నాయి. వీటి వైనం కాస్త అర్థం కావాలంటే కాస్త మూలాల్లోకి వెళ్లాలి.

అసలు గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రాజెక్టు ప్రారంభం కావడమే అనుకోకుండా ప్రారంభమైంది. అప్పటి దాగా వారాహి, 14 రీల్స్ కలిసి బాలయ్య వందో సినిమా నిర్మిస్తారన్నది పక్కా. అలాగే కృష్ణవంశీ సినిమాను రూపొందిస్తారనుకున్నారు. కానీ ఎప్పుడైతే శాతకర్ణి, అమరావతి అంటూ క్రిష్ రంగ ప్రవేశం చేసారో బాలయ్య ఆ ప్లాట్ కు ఫ్లాట్ అయిపోయారు. 

సినిమా నిర్మాణం విషయంలోనే చాలా మల్ల గుల్లాలు పడ్డారు. బాలయ్య అయితే ఇటు వారాహి వాళ్లను, క్రిష్ స్వంత బ్యానర్ ను కలిపి చేసుకోమన్నారు. ఎందుకంటే క్రిష్ భారీ బడ్జెట్ సినిమాలు హ్యాండిల్ చేయగలరా అన్న అనుమానం. తమకు ఆ సమస్య ఏమీ లేదని, ఎంతయినా ఖర్చు చేస్తామని ఈ ప్రాజెక్టును సోలోగా తీసుకున్నారు క్రిష్ అండ్ కానీ ఇప్పుడు చూస్తే సినిమా క్వాలిటీ బాలయ్య కు అంత సంతృప్తి నివ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. 

ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ విషయంలో బాలయ్య సంతృప్తిగా  లేరని, ఈ విషయం పదే పదే చెబుతున్నా క్రిష్ పట్టించుకొవడం లేదని తెలుస్తోంది. క్రిష్ తీరుపై బాలయ్య చాలా అసంతృప్తిగా వున్నారని అంటున్నారు. ఇంక ఒక్క పాట, హేమమాలిని బిట్స్ కొన్ని మాత్రమే పెండింగ్ వున్నాయని, ఇవి కానిచ్చేస్తే, హీరోతో తమకు సమస్య వుండదని క్రిష్ వర్గం భావిస్తోందట. 

సినిమాకు ఎంత హైప్ వచ్చినా మార్కెట్ 60 కోట్లు దాటలేదని, ఇంక గ్రాఫిక్స్ మీద ఎక్కువ ఎలా ఖర్చు పెట్టగలని క్రిష్ వర్గం, బాలయ్య మనుషులతో వాదనకు దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది బాలయ్య వందో సినిమా అని, క్వాలిటీ దగ్గర రాజీ వద్దని బాలయ్య మనుషులు వాదిస్తున్నారట. అదే విధంగా క్రిష్ కంపోజ్ చేయించిన కొన్ని ఫైట్లు కూడా బాలయ్య కు నచ్చలేదని, రీ షూట్ చేద్దాం అని అంటే ఖర్చుకు వెనుకాడి, క్రిష్ వినడం లేదని తెలుస్తోంది. ఫరావలేదు, బాగానే వున్నాయి అని, గ్రాఫిక్స్ జోడిస్తే ఇంకా బాగుంటాయి అని క్రిష్ సర్ది చెబుతున్నారట. 

ఇలా మొత్తం మీద కోరి ప్రాజెక్టు తీసుకున్న క్రిష్, తప్పనది సరై క్రిష్ చేతిలో ప్రాజెక్టు పెట్టి బాలయ్య ఎవరూ సంతృప్తిగా వున్నట్లు కనిపించడం లేదు.