ఇంట్రో సాంగ్‌లో చరణ్‌ సిక్స్‌ ప్యాక్‌.?

రామ్‌చరణ్‌ ఇప్పటిదాకా తన సిక్స్‌ ప్యాక్‌ని ప్రదర్శించలేదు. 'మగధీర' సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ లాంటి ఫిజిక్‌తో కనిపించాడంతే. 'చిరుత' సినిమాకే చరణ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని సాధించాడనే గుసగుసలు విన్పించాయి. ఇదే విషయాన్ని చరణ్‌…

రామ్‌చరణ్‌ ఇప్పటిదాకా తన సిక్స్‌ ప్యాక్‌ని ప్రదర్శించలేదు. 'మగధీర' సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ లాంటి ఫిజిక్‌తో కనిపించాడంతే. 'చిరుత' సినిమాకే చరణ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని సాధించాడనే గుసగుసలు విన్పించాయి. ఇదే విషయాన్ని చరణ్‌ వద్ద చాలాసార్లు ప్రస్తావిస్తే, ఇంకా ఆ అవసరం రాలేదు.. అంటూ సిక్స్‌ ప్యాక్‌పై సమాధానాన్ని దాటవేసేశాడు. 

అయితే, తన తాజా చిత్రం 'ధృవ' కోసం రామ్‌చరణ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని చూపించబోతున్నాడన్న గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. ఆ సిక్స్‌ ప్యాక్‌ కూడా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో కాదు, ఓ పాటలో చూపిస్తాడట. ఆ గాసిప్స్‌కి బలానిచ్చేలా, దీపావళికి చరణ్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టింగ్‌ వుంది. దీపావళికి కూడా ఖాళీగా లేననీ, సినిమా కోసం కష్టపడ్తున్నానని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు చరణ్‌. 'ధృవ' ఇంట్రో సాంగ్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్న చరణ్‌, అందుకోసం ట్రెయినర్‌తో శరీరాన్ని కష్టపెట్టేశాడట. 

ఇంకేముంది.? పోస్ట్‌లో చరణ్‌ ఫిజిక్‌ని చూస్తే లోపల సిక్స్‌ ప్యాక్‌ వున్నట్లే కన్పిస్తోందని అభిమానులు ఫిక్సయిపోయారు. పాటల్లో కన్నా ఫైట్స్‌లో సిక్స్‌ ప్యాక్‌ అయితే బెటర్‌ కదా.! ఏమో మరి, ఇంట్రో సాంగ్‌ విషయంలో చరణ్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటాడు. మరి, 'ధృవ' ఇంట్రో సాంగ్‌కి ఈ సిక్స్‌ ప్యాక్‌ వెరీ వెరీ స్పెషల్‌ కానుందా.? వేచి చూడాల్సిందే.