గ్రీకు పురాణాల్లో వీటి ప్రస్తావన ఉంది.. మనసును మాయ చేయగల, శరీరానికి శృంగారోత్తేజాన్ని కలిగించ గల వాటిగా వీటి ప్రస్తావనలున్నాయి. మరి వీటి రహస్యం నేటికి తెలియనేదేమీ కాదు.. వీటి అహ్లాదాన్ని అనుభవించే వాళ్లకు తెలుసు ఆ మహత్యం! ఆహారంగా తీసుకుంటే.. ‘ఆకలి’ పెంచేవి కొన్ని… సువాసనతోనే ప్రభావం చూపేవి మరి కొన్ని! పురాణాల్లో ప్రస్తావనలే కాదు..అధునాతన శాస్త్రాలు కూడా ‘ఔనును..’ అంటూ వీటి పవర్ ను ఒప్పేసుకున్నాయి.
లవంగాలు.. సుగంధ ద్రవ్యాలు బాగా పండే భారతదేశంలో వంటింటిలోనూ, వైద్యంలోనూ వీటికి సముచిత స్థానం ఉంది. అలాగే శృంగారోత్తేజంలోనూ లవంగం పాత్ర అద్వీతీయమని భారతీయ వైద్య శాస్త్రం కూడా ఒప్పుకుంటోంది. వైల్డ్ సెక్స్ ను కోరుకుంటున్నారా.. ఒక చిటికెడు లవంగం పౌడర్ ను లేట్ నైట్ కాఫీలో వేసి మీ పార్టనర్ కు ఇవ్వండని ఆడవారికి సలహా ఇస్తున్నారు శృంగార శాస్త్ర పరిశోధకులు. ఈ ట్రిక్ ను పాటించమని చెబుతున్నారు.
శాండల్ వుడ్.. చందనానికి కూడా భారతదేశం పుట్టిల్లే. దీని సుగంధం వెదజల్లే సువాసన శరీరంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందని సైన్సు కూడా తేల్చి చెబుతోంది. ప్రత్యేకించి శుద్ధమైన శాండల్ వుడ్ కు శృంగార కోరికలను ప్రేరేపించగల శక్తి ఉంటుందని చెబుతున్నారు. పిట్యూటరీ గ్రంధి మీద చందనం సువాసన ప్రభావాన్ని చూపిస్తుందని, ఫలితంగా బ్రహ్మాండమైన సెక్స్ డ్రైవ్ ఉంటుందని వివరిస్తున్నారు. బాత్ టబ్ లోకి శాండల్ వుడ్ ఆయిల్ కొన్ని డ్రాప్స్ వేసుకుంటే.. ఆ టబ్బే బెడ్ అయిపోతుందని వర్ణనాత్మకంగా చెబుతున్నారు.
పెప్పర్ మింట్ ఆయిల్…
మసాజ్ తో మత్తెక్కించే ఆయిల్ అట ఇది. దీని మహత్యం అనుభవించే వాళ్లకే అర్థమవుతుందంటున్నారు. శరీరానికి మసాజ్ తో దీని ప్రభావం మెదడు వరకూ చేరుతుందని.. సెక్సువల్ ఆపరేషన్ అలా మొదలవుతుందని కూలంకషంగా చెబుతున్నారు.
జాస్మిన్ పై పెద్ద పరిశోధనే చేశారు!
శృంగార శాస్త్రాల అభ్యాసం అక్కర్లేదు.. రసాస్వాదన గురించి పరిశోధనలు అక్కర్లేదు.. ఇండియన్స్ కు మల్లెల మత్తు ఏమిటో, ఆ మహత్యమేమిటో వివరించనక్కర్లా! అయితే ఈ విషయం గురించి కెనడియన్ పరిశోధకులు పెద్ద పరిశోధనే చేశారు. శృంగార ప్రేరేపణలో అద్భుతాలు చేసే శక్తి మల్లెలకు ఉందని ఇప్పుడు వీరు చెబుతున్నారు. ఆ సెంట్లను వాడమని సూచిస్తున్నారు. శృంగార గీతాల్లోనూ, విరహ గీతాల్లోనూ మల్లెల ప్రస్తావన తప్పనిసరిగా చేసుకున్న భారతీయులకు ఈ మాటలు చెప్పాలా!