బాలయ్య జననీ జన్మభూమి అనే సినిమా చేసాడు. డబ్బున్న కుర్రాడు లోకం ఎలా వుంటుంది. బతుకులు ఎలా వుంటాయి చూడడం. అలాగే నాగ్ కూడా ఓ సినిమా చేసాడు. నేటి సిద్దార్థ అంటూ. మాఫియా సామ్రాజ్యాన్ని వదిలి సాధారణ జన జీవనంలోకి వెళ్లడం.
ఇవన్నీ కూడా గౌతమీ బుద్ద కథ ప్రేరణతో అల్లుకున్న కథలే. మహరాజు కుమారుడు జనన మరణాలు, జన్మ దుఖాలు చూసి ఇల్లు వదిలి వెళ్లడం. అయితే ఇలాంటి సబ్జెక్ట లు జనాలకు ఎక్కలేదు. కానీ దీన్నే ఫన్నీగా, సరదాగా చెబితే త్రివిక్రమ్ అత్తారింటికి దారేది జనం చూసారు.
ఇప్పుడు ఇదే లైన్ ను స్టయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సంపత్ నంది. అరుణాచలం రమణ మహర్షి హూ యామ్ ఐ అనే ఆధ్యత్మిక గ్రంథం తన సినిమా లైన్ కు స్ఫూర్తి అంటున్నారు.
అయితే డబ్బున్న కుర్రాడు జనంలోకి వచ్చి వాళ్ల కష్టాలు చూడడం, వాళ్లకు అండగా నిలబడడం, గతంలో ఏదో రూపంలో చాలా మంది హీరోలు చేసారు. ప్రభాస్ చక్రంలో కూడా ఇలాంటి లైన్ కొంత వుంటుంది. ఇక ఆ మధ్య వచ్చిన బిచ్చగాడు సినిమా సంగతి తెలిసిందే.
ఇంత మంది ఇన్ని రకాలుగా ట్రయ్ చేసిన దాన్ని సంపత్ నంది ఎంత కొత్తగా చెప్పబోతున్నాడో. దాన్ని బట్టే వుంటుంది సినిమా సక్సెస్. ఈ సినిమా సంపత్ నందికి ఎంత అవసరమో, గోపీచంద్ కు అంతకన్నా ఎక్కువ అవసరం.
జిల్ సినిమా ఫ్లాప్ అయింది. ఆరడగుల బుల్లెట్ అలా వుండిపోయింది. ఆక్సిజన్ విడుదలకు బెత్తెడు దూరంలో వుంది. అందువల్ల ఈ సినిమా హిట్ అయితేనే గోపీచంద్ కెరీర్ ముందుకు సాగుతుంది.