సో మెనీ కుక్స్, స్పాయిల్ ది సూప్ అని అంటారు కానీ, టాలీవుడ్ లో ఎనభైల దశకంలో స్క్రిప్ట్ తయారీకి ఎక్కవ మంది రైటర్లు కూర్చునేవారు.
కాస్త పేరున్న రైటర్లను, సినిమా జనాలను అందరినీ కలిపి, సిట్టింగ్ లు వేసి, అందరూ కలిసి నలభీమపాకం మాదిరిగా కథ తయారుచేసేవారు. బేసిక్ లైన్ ను పట్టుకుని, సాగగొట్టి, ఎగ్గొట్టి, దిగ్గొట్టి అయ్యవారినో, కోతి బొమ్మనో ఏదో ఒకటి తయారుచేసేవారు.
మెగాస్టార్ చిరంజీవి ఆ స్కూలు నుంచి వచ్చారు. అందుకే ఆయన ఇప్పటికే అదే తరహాను నమ్ముతారు. ఖైదీ నెంబర్ 150 స్క్రిప్ట్ మీద కూడా చాలా మంది ఆలోచనలు పడ్డాయి.
ఇప్పుడు ఉయ్యాలవాడ స్క్రిప్ట్ ను కూడా ఇలాగే చెక్కే పని స్టార్ట్ చేసారట. ఈ స్క్రిప్ట్ ను ఎప్పుడో పూర్వాశ్రమంలో పరుచూరి బ్రదర్స్ రెడీ చేసారు. ఈ మధ్య దాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టడీ చేసి పక్కన వుంచారు.
ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఎవరో ఆరుగురు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం ప్రారంభించారన్నది. వీరిలో పరుచూరి గోపాలకృష్ణ, రైటర్ సత్యానంద్ వున్నారని అంటున్నారు. మరి మిగిలిన నలుగురు ఎవరో తెలియదు. వీళ్లంతా కలిసి, సురేందర్ రెడ్డి, మెగాస్టార్ సూచనలతో స్క్రిప్ట్ చెక్కుతున్నారని తెలుస్తోంది.
అన్నీ గాలి వార్తలే
ఉయ్యాల వాడ సినిమా ఇంకా ఇలా స్క్రిప్ట్ స్టేజ్ లోనే వుందని, హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్, కణల్ కన్నన్ అంటూ వస్తున్నవి అన్నీ గాలి వార్తలే అని మెగా క్యాంప్ వర్గాల బొగట్టా.
రామ్ చరణ్ ఇప్పుడు తన సినిమాతో ఫుల్ బిజీగా వున్నారని, ఆయన సినిమా వర్క్ అయ్యాక, ఉయ్యాలవాడ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే, ఎవరు? ఏమిటి? అన్నవి అన్నీ డిస్కషన్ లోకి వస్తాయని అంటున్నారు.