టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కాస్త ఎక్కువగానే వుంది. కొత్త కొత్త వాళ్లని తీసుకువస్తున్నా సక్సెస్ కావడం తక్కువగా వుంది. సక్సెస్ అయిన వాళ్లు అమాంతం రేటు పెంచుతున్నారు. ముంబాయి వాళ్లని, కేరళ కుట్టిలను వెదికి తీసుకురావడం అలవాటే.. వాళ్లు కూడా తొలి సినిమాకు అయిదు నుంచి పదిలక్షలు అడుతున్నారు.
ఇలాంటి సమయంలో కాస్త కనుముక్కు తీరు, పర్సనాలిటీ బాగుండి, పాతిక సినిమాలు అనుభవం వున్న అమ్మడు.. కేవలం 18లక్షలకే వచ్చిందంటే.. కాస్త చౌక బేరమే అనుకోవాలి. సునీల్ తో పరుచూరి ప్రసాద్ నిర్మించే సినిమాకు మియు జార్జ్ అన్న కొత్త అమ్మాయిని తీసుకు వచ్చారు. ఈ అమ్మాయిది కేరళ అయినా ముంబాయిలోనే పెరిగింది. పైగా తమిళ, మళయాల సినిమాల్లో రాటుతేలింది.
అలాంటి అమ్మాయి పద్దెనిమిది లక్షలకు సినిమాకు దొరికింది అంటే ఫరవాలేదనే అనుకోవాలి.. నిజానికి ఆ అమ్మాయి పాతిక లక్షలు డిమాండ్ చేసిందని వినికిడి. బేరాలాడి 18కి తెగ్గొట్టారు.. కొత్త ఛాన్స్ లు వస్తే మాత్రం రేటు పెరిగిపోతుంది.. తప్పదు.. డిమాండ్ సప్లయ్ సూత్రం.