కోరిక, ఇష్టాలకు, ముచ్చట్లకు వయసుతో పనేం వుంటుంది. రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే మహిళ వయసు 106 ఏళ్లు. ఈ ముదుసలికి జీవతంలో ఒకటే కోరిక మిగిలింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సెల్ఫీ దిగాలని. పురాణ కాలంలో శబరి రాముడి కోసం ఎదురుచూసినట్లు, ఈ వృద్ధురాలు మహేష్ తో ఫొటో కోసం ఎదురుచూస్తోంది.
ఈ వార్త ఆ నోటా, ఈనోటా పడి, చానెళ్లకు ఎక్కింది. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని మహేష్ దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఆ ముసిలావిడ ముచ్చట తీర్చాలని, ఆమెతో కలిసి ఫోటో తీయించుకోవాలని మహేష్ బాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విదేశాల్లో వున్న మహేష్ నేడో, రేపో ఇక్కడికి రానున్నారు. వచ్చిన తరువాత ఫ్యాన్స్ సాయంతో ఆమెను హైదరాబాద్ రప్పించే ఆలోచన ఏదో చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీపైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నారు మహేష్ బాబు.
ఈ సినిమా అమెరికా షెడ్యూలు జస్ట్ ప్యాక్ అయింది. ఈ సినిమా తరువాత షెడ్యూలు కూడా పెద్దగా గ్యాప్ లేకుండానే హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది.
ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్