లెక్కప్రకారం.. దీపావళి పర్వదినాన ఈరోజు బన్నీ-త్రివిక్రమ్ సినిమాను అధికారికంగా ప్రకటించాలి. ఈ మేరకు తెరవెనక ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. స్వయంగా బన్నీతో ఈ ప్రకటన చేయించాలని అనుకున్నారు. కానీ అది వాయిదాపడింది. వాయిదాపడిన విషయాన్ని మాత్రం బన్నీ అఫీషియల్ గా ప్రకటించాడు.
“అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ జీవితాల్లో ఈ దీపావళి మరిన్ని వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. నా కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న నా ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో ఉంటుంది.”
ఇలా అందరికీ పండగ శుభాకాంక్షలు చెబుతూనే, సినిమా ప్రకటనను వాయిదా వేశాడు బన్నీ. నిజానికి బన్నీ ఇలా తన సినిమా ప్రకటన వాయిదా వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఓసారి ఇలానే ప్రకటించాడు. తన సినిమా ప్రకటన ఇంకాస్త ఆలస్యం అవుతుందని, వెయిట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ తాజా ట్వీట్ దానికి కొనసాగింపు మాత్రమే.
బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా మాత్రం కన్ ఫర్మ్. కానీ ప్రాజెక్టు ప్రకటిస్తే… అటు త్రివిక్రమ్, ఇటు బన్నీ ఇద్దరికీ ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇద్దరి వద్ద కొన్ని అడ్వాన్సులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది మళ్లీ కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. పైగా వీళ్ల కాంబోకు ఇంకా స్టోరీలైన్ ఫిక్స్ అవ్వలేదు. అందుకే ఈరోజు వెలువడాల్సిన ప్రకటనను వాయిదావేశారు.
ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్