భరత్ అనే నేను సినిమాలో వెండితెరపై మనం చూసింది కొంతభాగం మాత్రమే. దాదాపు 4 గంటల సినిమా నుంచి గంట నిడివి దృశ్యాల్ని కట్ చేశారు. అలా ఎవరికీ కనిపించని భరత్ ఇప్పుడు యూట్యూబ్ లో హంగామా చేస్తున్నాడు. అవును.. భరత్ డిలీటెడ్ సీన్స్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.
ఒకేసారి భరత్ అనే నేను సినిమా నుంచి 4 డిలీటెడ్ సన్నివేశాల్ని యూట్యూబ్ లో అప్ చేశారు. విద్యా వ్యవస్థ, రైతుల సమస్యలు, అసెంబ్లీ, పెరుగుతున్న జనాభా అంశాలకు సంబంధించి సినిమాలో లేని 4 సన్నివేశాల్ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరోవైపు ఈ సినిమాకు రెండువారాల్లో ప్రపంచవ్యాప్తంగా 190 కోట్ల 63లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించారు నిర్మాతలు. ప్రాంతాల వారీగా బ్రేకప్ మాత్రం విడుదల చేయలేదు. అటు విడుదలైన 30 రోజులకే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారట. దీనిపై నిర్మాతల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.