‘బండ్ల’ అనుకున్నది సాధించాడు

పదేళ్ల తరువాత మళ్లీ మేకప్ వేసుకునే అవకాశం వచ్చింది కమెడియన్ కమ్ నిర్మాత బండ్లగణేష్ కు. సాధారణంగా ఎవరైనా అయితే ఎగిరిగంతేస్తారు. కానీ బండ్ల బేరాలు సాగించాడు. యూట్యూబ్ లో తనకున్న పాపులారటీ తనకు…

పదేళ్ల తరువాత మళ్లీ మేకప్ వేసుకునే అవకాశం వచ్చింది కమెడియన్ కమ్ నిర్మాత బండ్లగణేష్ కు. సాధారణంగా ఎవరైనా అయితే ఎగిరిగంతేస్తారు. కానీ బండ్ల బేరాలు సాగించాడు. యూట్యూబ్ లో తనకున్న పాపులారటీ తనకు తెలుసు కనుక, రోజుకు అయిదు లక్షలు ఇస్తేనే చేస్తానని చెప్పాడట. లేకపోతే చేయనని అనేసాడు. అయితే అలా నేరుగా చెప్పకుండా, తనకు విదేశీ క్యాంప్ వుందని, చేయనని ఇలా సాకులు చెప్పి, సాగదీసి, ఆఖరికి తనకు కావాల్సిన రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతకు ముందు ఇంకో యవ్వారం జరిగింది. బండ్ల మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడని తెలిసి, దర్శకుడు మారుతి కూడా తన లేటెస్ట్ మూవీ 'ప్రతిరోజు పండుగే'లో ఓ కీలకపాత్రకు అడిగాడు. అక్కడా ఇదే డిమాండ్. రోజుకు అయిదు లక్షలు కావాలని. దాంతో మారుతి మారు మాట్లాడకుండా, అజయ్ ను తీసేసుకున్నాడు ఆ పాత్రకు.

అయితే అనిల్ రావిపూడి మాత్రం తనకు బండ్లగణేష్ నే కావాలని నిర్మాతను ఒప్పించినట్లు తెలుస్తోంది. జస్ట్ 7 రోజులు మాత్రమే కనుక, 35 లక్షల రెమ్యూనిరేషన్ తో సరిపోయిందన్నమాట. అయితే ఇప్పటివరకు కమెడియన్లలో ఎక్కువ తీసుకున్నది సునీల్, బ్రహ్మానందం మాత్రమే. ఇప్పుడు ఆ లైన్ లో బండ్ల కూడా చేరాడన్నమాట.

ఈరోజు నుంచి అంటే అయిదవ తేదీ నుంచి సెట్ మీదకు వెళ్తున్నాడు బండ్ల గణేష్. సినిమాలో వచ్చే కీలక ట్రయిన్ ఎపిసోడ్ లో అతని పాత్ర మధ్య స్టేషన్ లో ఎంటర్ అవుతుంది. అప్పటికి అదే ట్రయిన్ లో, హీరో, హీరోయిన్, రావురమేష్, ఇలా చాలామంది నటులు వుంటారు. వారితో బండ్ల కూడా జాయిన్ అయి కామెడీ చేస్తాడన్నమాట. 

తెలుగుదేశం.. ‘నో ప్లాన్’ వారి గేమ్ ప్లాన్