Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బండ్ల' భవిష్యత్ ఏమిటో?

'బండ్ల' భవిష్యత్ ఏమిటో?

కర్ర విరగకుండా, పాము చావకుండా, లేదా, ఏ ఇంటి పాట ఆ ఇంటి దగ్గర పాడేసి బతికేయడంలో మన సినిమా జనాలు ఘనులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో సినిమా ఇండస్ట్రీ ఇక హైదరాబాద్ లో వుందనే అనుకున్నారు. కేసిఆర్ కూడా రామోజి ఫిలింసిటీని వేయి నాగళ్లతో దున్నిస్తా అన్నారు.

కానీ మన సినిమా జనాలు గొప్పోళ్లు, కేసిఆర్ నే బుట్టలో వేసేసారు. కేటిఆర్ తో చెట్టపట్టాలేసుకున్నారు. సినిమా జనాలతో చిరకాల స్నేహం వున్న తలసాని ని తమశాఖ మంత్రిని చేసుకున్నారు. అదే సమయంలో చాలామంది సామాజిక బంధాలతో అటు చంద్రబాబుతో కూడా బంధాలు పెంచుకున్నారు. ఇలా రెండుచోట్ల తమ హవా నడుపుకుంటూ పనులు చేసుకుంటూ వచ్చారు.

అయితే ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు-కేసిఆర్ ప్రత్యర్థులు అయ్యారు. దాంతో సినిమా పరిశ్రమ మొత్తం సైలంట్ అయింది. ఎవరు గెలిస్తే వాళ్లకు శాలువా కప్పొచ్చు.. తమ పనులు, తమ పైరవీలు తాము చేసుకోవచ్చు అని డిసైడ్ అయి సైలంట్ అయ్యారు.

కానీ ఒక్కడు మాత్రం తన చిత్తానికి చెలరేగిపోయాడు. అతడే బండ్లగణేష్. సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద బండ్లగణేష్ ఓపెన్ అయినట్లు, చెలరేగిపోయినట్లు ఎవ్వరూ ముందుకురాలేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా అతగాడి మాటలు, హడావుడి నచ్చి అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది. ఆశించిన ఎమ్మెల్యే టికేట్ మాత్రం ఇవ్వలేదు.

అయినా కూడా బండ్ల వెనక్కు తగ్గకుండా ప్రచారంచేసి, తెల్లవారితే టీవీల్లో కూర్చుని, ఎలాపడితే అలా మాటల తూటాలు విసిరేసాడు. నిజానికి బండ్లకు బొత్స గురువు. కానీ వైకాపా వైపు వెళ్లలేదు. ఇక్కడ పార్టీ కూడా లేదు. పవన్ ను దేవుడు అంటాడు. ఆయన పార్టీవైపు వెళ్లలేదు. కాంగ్రెస్ వైపు వచ్చాడు.

ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓకె. బండ్లకు మంచిచేసినా చేయకున్నా, హాని మాత్రం జరగదు. కానీ టీఆర్ఎస్ పవర్ లోకి వస్తే మాత్రం ఎలా వుంటుందో చూడాలి. ఎందుకంటే, బండ్లకు వ్యాపారాలు అన్నీ తెలంగాణలోనే వున్నాయి. బండ్లు ఓడలవుతాయో? కడగండ్ల పాలు అవుతాయో మరి. వెయిట్ అండ్ సీ..

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?