Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విలక్షణ నటుడు ఈసారైనా మెప్పిస్తాడా..?

విలక్షణ నటుడు ఈసారైనా మెప్పిస్తాడా..?

నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా మాధవన్ కు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు ఇతడు. ఇలాంటి నటుడు సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా మారాడు. కానీ ఆ సినిమా ఇతడికి ఏమాత్రం కలిసిరాలేదు. నెగెటివ్ షేడ్స్ తో మాధవన్ పోషించిన అరుణ్ పాత్రకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఇప్పుడీ నటుడు తన రెండో ప్రయత్నం ప్రారంభించాడు.

త్వరలోనే మరో తెలుగు సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు మాధవన్. అదే రవితేజ-వీఐ ఆనంద్ మూవీ. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం మాధవన్ ను సంప్రదించారు. మాధవన్ కూడా ఆల్ మోస్ట్ అంగీకరించినట్టే.

ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మాధవన్. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ సిరీసుల్లో కూడా నటిస్తున్నాడు. ఇంత బిజీగా ఉంటూ కూడా వీఐ ఆనంద్ సినిమాకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ పాత్రతోనైనా మాధవన్ విలన్ గా మెప్పిస్తాడేమో చూడాలి.

రామ్ తళ్లూరి నిర్మాతగా ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పుచేర్పులు చేయడం కోసం మరో నెల రోజులు గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నారు. మాధవన్ రాకతోనే స్క్రిప్ట్ లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయట.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?