Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హ్యాట్రిక్ ఫ్లాపులు.. ఈ ఏడాదికి ఇంతే

హ్యాట్రిక్ ఫ్లాపులు.. ఈ ఏడాదికి ఇంతే

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది మెహ్రీన్. చూడ్డానికి ఓ యాంగిల్ లో కాజల్ లా కనిపించే ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ కథలు, బ్యానర్ల ఎంపికలో చేసిన తప్పుల వల్ల మెహ్రీన్ కెరీర్ గాడితప్పింది. గతేడాది చేసిన తప్పులు ఆమెను ఈ ఏడాది కూడా వెంటాడాయి. ఫలితంగా 2018ని ఫ్లాపులతో ముగించబోతోంది ఈ బ్యూటీ.

ఈ ఏడాది పంతం మూవీతో థియేటర్లలోకి వచ్చిన మెహ్రీన్ కు ఫ్లాప్ తప్పలేదు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడలేదు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన నోటా సినిమా చేసింది. పంతంపై పెద్దగా ఆశలు పెట్టుకోని మెహ్రీన్, నోటాపై మాత్రం చాలా హోప్స్ పెట్టుకుంది.

తనుచేసిన సీరియస్ పాత్రపై నమ్మకంగా ఉండడంతో పాటు, విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ కూడా కలిసొచ్చి నోటా పెద్ద హిట్ అవుతుందని ఆశపడింది. కానీ అనూహ్యంగా నోటా కూడా పరాజయం పాలైంది. స్వయంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్నాడు.

దీంతో మెహ్రీన్ కు మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. ఇక తాజాగా వచ్చిన కవచం కూడా ఆమె ఫ్లాపుల పరంపరను పరిపూర్ణం చేసింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన కవచం సినిమా కూడా ఫ్లాప్. ఈ ఏడాది మెహ్రీన్ కు ముచ్చగా మూడో ఫ్లాప్ ఇది.

ఈ దెబ్బతో హ్యాట్రిక్ ఫ్లాపులతో 2018ను ముగించింది మెహ్రీన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎఫ్-2 అనే సినిమా చేస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. ఇప్పుడు మెహ్రీన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?