మలయాళంలో హిట్ అయిన టూ కంట్రీస్ సినిమాను కోటికి పైగా ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసానని ప్రకటించాడు భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్. ఆ తరువాత ఆ సినిమా వెంకటేష్ హీరోగా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత మరి అతీగతీ లేదు. ఏంటీ సంగతీ అని ఆరా తీస్తే చాలా ఆసక్తికరమైన సంగతులు బయటకు వచ్చాయి.
ఈ సినిమా నిర్మాతో, దర్శకుడో మన తెలుగు దర్శకుడు ఎన్ శంకర్ కు స్నేహితుడంట. ఆ స్నేహంతో సునీల్ కు ఈ సబ్జెక్ట్ సరిపోతుందని తీసుకువచ్చి చూపించారట. కానీ సునీల్ పూర్తిగా కన్సెంట్ ఇవ్వకపోవడం జరిగింది. ఇలాంటి సమయంలో నిర్మాత బండ్ల గణేష్ సీన్ లోకి ఎంటర్ అయ్యారని వినికిడి. గీసి గీసి బేరమాడి, యాభై లక్షలకు సినిమా హక్కులు కొనడానికి ఓకె అన్నారని తెలుస్తోంది.
దాంట్లో పదిలక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి, హీరో ఓకె అయ్యాక, మిగిలిన నలభై ఇస్తానన్నారని టాలీవుడ్ టాక్. అయితే ఇక్కడ హక్కులు ఇచ్చేవారు ఓ మెలిక పెట్టారట. ఫిబ్రవరి నెలాఖరులోగా హక్కులు తీసుకోవాలని, లేదంటే, అడ్వాన్స్ వదిలేసుకోవాలనీ. ఇప్పుడేమయింది. వెంకటేష్ ఎస్ ఆర్ నో చెప్పలేదని వినికిడి. ఫిబ్రవరి నెలాఖరు వచ్చేసింది. మరి ఏ హీరో ముందుకు రాలేదు..మరి హక్కులు తీసుకుంటారా? అడ్వాన్స్ వదులుకుంటారో? చూడాలి మరి.