ఇదీ అలాంటిదేనా దశరథ్?

టాలీవుడ్ లో కొన్ని వార్తలు పుడతాయి.. మరి కొన్ని వార్తలు పుట్టిస్తారు. వీటి వెనుక చాలా వ్యవహారాలు దాగి వుంటాయి. ముఖ్యంగా సినిమాలు విడుదైనపుడు వాటికి హైప్ తీసుకురావడం కోసం కూడా కొన్ని వార్తలు…

టాలీవుడ్ లో కొన్ని వార్తలు పుడతాయి.. మరి కొన్ని వార్తలు పుట్టిస్తారు. వీటి వెనుక చాలా వ్యవహారాలు దాగి వుంటాయి. ముఖ్యంగా సినిమాలు విడుదైనపుడు వాటికి హైప్ తీసుకురావడం కోసం కూడా కొన్ని వార్తలు బయటకు వస్తుంటాయి. దర్శకుడు దశరథ్ త్వరలో హీరో ప్రభాస్ తో సినిమా చేస్తారని చక్కర్లు కొట్టిన వార్త కూడా ఇంచుమించు అలాంటిదే అనిపిస్తోంది. 

ఎందుకంటే ఒకప్పుడు మిస్టర్ పెర్ ఫెక్ట్ అంటూ ప్రభాస్ కు మంచి హిట్ ఇచ్చి వుండొచ్చు దశరథ్. కానీ  అప్పుడు ప్రభాస్ ఇమేజ్ వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు ఫ్రభాస్ ఏ సినిమా చేసినా, అది వంద కోట్ల రేంజ్ లో వుండాల్సిందే. పైగా బాహుబలి, యువి సినిమా, కృష్ణంరాజుగారి సినిమా, ఇంకా చాలా మందికి ప్రభాస్ చేస్తా అన్నవి వున్నాయి. 

అందవల్ల వీటి నడుమ దశరథ్ వంతు రావడం అంటే కాస్త కష్టమే కావచ్చు. అయితే దశరథ్ ఇప్పుడు మిస్టర్ పెర్ ఫెక్ట్ ను గుర్తుచేయడం, ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వుంది అనడం ఇప్పుడు ఈ సినిమాకు పనికి రావడానికే అన్నది టాలీవుడ్ గుసగుసల సారాశం.