టెంపర్ తరువాత ఇంతవరకు సినిమా చేయలేదు నిర్మాత బండ్ల గణేష్. పవర్ స్టార్ నుంచి అఖిల్ దాకా అందరినీ ట్రయ్ చేసాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆఖరికి డబ్బింగ్ సినిమాలు వదుల్దాం అనుకున్నాడు అవీ సెట్ కాలేదు. ఇప్పుడు చివరాఖరికి రవితేజ ను పట్టుకున్నాడు. బండ్లను నిర్మాతను చేసింది రవితేజనే.
మరి ఆ విశ్వాసంతోనో, మరెందుకో, డ్రగ్స్ కేసులో రవితేజను వెనకేసుకుని వచ్చాడు. మరే నిర్మాత, డైరక్టర్ మాట్లాడకపోయినా, రవితేజకు మద్దతుగా బోలెడు ట్వీట్లు చేసాడు. ఇవన్నీ ఫలించి, రవితేజ అభిమానంతో బండ్లకు ఓ సినిమా చేసి పెడతాడేమో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
పాపం, వేదిక ఎక్కి మైకు పట్టుకుంటే పూనకం వచ్చేస్తుంది బండ్లకు. ఆ పూనకంలో దాదాపు ప్రతి హీరోను ఎంతగా గాల్లోకి లేపాలో అంతా లేపాడు. కానీ ఫలితం లేకపోయింది.
కానీ ఈ కేసుల టైమ్ లో తనను నైతికంగా వెనకేసుకు వచ్చిన బండ్ల అంటే చిన్న సాప్ట్ కార్నర్ వచ్చి, సరే చూద్దాంలే అని అనేసాడు రవితేజ అని వినికిడి. ఇదే నిజమై బండ్లకు సినిమా చేస్తే అతగాడు మళ్లీ నిర్మాతగా ట్రాక్ లోకి వచ్చేస్తాడు. మరి ఆ ఆశ తీరుతుందో? తీరదో?