cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బండ్ల..ఆలీ..సాయికుమార్ @ జబర్దస్త్

బండ్ల..ఆలీ..సాయికుమార్ @ జబర్దస్త్

జబర్దస్త్ కు కీలకమైన నాగబాబు అక్కడ నుంచి తప్పుకున్నారు. రోజా మాత్రం అక్కడే వున్నారు. ఇప్పుడు ఆ ఖాళీ భర్తీ చేసేవారు కావాలి. ఎవరు? ఎవరు? ఎవరు?

కేవలం కుర్చీలో కూర్చుని నవ్వడానికి అయితే ఎవరైనా దొరుకుతారు. కానీ షో కి కాస్త ప్లస్ కావాలి. ఎందుకంటే జబర్దస్త్ కు ఇదివరకంత టీఆర్పీ లేదు. కానీ యూ ట్యూబ్ లో మాత్రం పిచ్చ పాపులారిటీ వుంది. హిట్ లు వున్నాయి.

పైగా జీ టీవీలో దీనికి పోటీ కార్యక్రమం రాబోతోంది. అందులోనూ అక్కడ థనరాజ్, వేణు మళ్లీ స్కిట్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. చమ్మక్ చంద్ర, ఆర్పీ అక్కడికే వెళ్లిపోయారు.

ఇలాంటి నేపథ్యంలో జబర్దస్త్ కు అట్రాక్షన్ కాగల జడ్జ్ కావాలి. అంతే కాదు, జనాలు ఆ జడ్జ్ కోసం కూడా అక్కడకు రావాలి. అందుకే ప్రస్తుతం మూడు పేర్లు పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీవీ షో లు చేసిన సాయి కుమార్, ఆలీ పేర్లతో పాటు యూ ట్యూబ్ లో క్రేజ్ వున్న బండ్ల గణేష్ ను మల్లెమాల యూనిట్ సంప్రదిస్తోంది. ఆలీ తనకు టైమ్ సరిపోదు అని చెప్పినట్లు తెలుస్తోంది. సాయి కుమార్ ఏమన్నారో తెలియదు. బండ్ల మాత్రం చేయడానికి సుముఖంగానే వున్నట్లు బోగట్టా.

ఒకటి రెండు రోజుల్లో ఏ సంగతి తెలిసిపోతుంది.