‘బంగారం’ లాంటి ప్రశ్నలు

తిరుమల శ్రీవారి​ బంగారం తరలింపు విషయంలో రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అధికారులు భలే చిత్రం వారి వివరణ వాళ్లు ఇచ్చారు. కానీ అనుమానాలు చాలా మిగిలి వున్నాయి. వాటికి సమాధానాలు ఎప్పటికి వస్తాయో?…

తిరుమల శ్రీవారి​ బంగారం తరలింపు విషయంలో రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అధికారులు భలే చిత్రం వారి వివరణ వాళ్లు ఇచ్చారు. కానీ అనుమానాలు చాలా మిగిలి వున్నాయి. వాటికి సమాధానాలు ఎప్పటికి వస్తాయో?

సాధారణంగా పదివేల ఫిక్స్ డ్ డిపాజిట్ మెచ్యూర్ అయితేనే కొద్దిరోజులు ముందుగా బ్యాంక్ అధికారులు మెసేజ్ ఇస్తారు. రెన్యువల్ చేయాలా? వద్దా? అని. అన్ని వందలకోట్ల డిపాజిట్ కు ముందుగా తెలియచేసారా? లేదా?

తెలియచేసి వుంటే, తమ బంగారం తమ దగ్గరకు ఎప్పుడు ఎలా చేరుతుంది? అన్నది టీటీడీ అధికారులు తెలుసుకున్నారా? లేదా? 

టీడీడీ డిపాజిట్ చేసిన బంగారం, అలా అదే రూపంలో వుంచి, అదే వాపసు చేస్తారా? లేక దాన్ని బ్యాంక్ రకరకాలుగా వినియోగించి, మళ్లీ వెనక్కు ఇచ్చినపుడు తమ దగ్గర అందుబాటులో వున్న బంగారం ఇస్తుందా?

విదేశీ ముద్రలు వున్న బంగారం ఇవ్వడంపై ఇటు అధికారులు కానీ, బ్యాంక్ వారు కానీ ఎందుకు సమాధానం చెప్పడంలేదు? 

ఎన్నికల టైమ్, చెకింగ్ లు వుంటాయి, అధికారులు ఆపుతారు అని బ్యాంక్ వారికి తెలియదా? అందుకు తగిన జాగ్రత్తలు, కాగితాలు సిద్దంచేసి ఇవ్వాలి కదా?

లేదా, ఎన్నికల టైమ్.. ఇలాంటి సమయంలో తరలింపు తగదు అని టీటీడీ అధికారులయినా చెప్పి వుండాలి కదా?

అన్ని వందల కోట్ల బంగారం వస్తోంది అంటే బాధ్యత కలిగిన టీటీడీ అధికారులు ఎవ్వరూ ఎందుకు తిరుపతిలో వుండకుండా ఒంటిమిట్టకు వెళ్లిపోయారు?

అసలు ఈ విషయంలో బ్యాంక్ అధికారులు ఎందుకు వినవస్తున్న అనుమానాలపై స్పందించడం లేదు?

అన్నింటికి మించి… తెలుగునాట తెలుగుదేశం అనుకూల మీడియా మొత్తం ఈ వ్యవహారంపై ఎందుకు మౌనం పాటిస్తోంది?

సమాధానాలు ఏడుకొండల వాడికే తెలియాలేమో?

'ఎవరు గెలుస్తారు?' అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది

కాంచన నుంచి పాఠాలు లారెన్స్ నేర్చుకున్నాడా?