Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్యాంకాక్ లో పూరి సినిమా

బ్యాంకాక్ లో పూరి సినిమా

దర్శకుడు పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న రోగ్ సినిమా షూటింగ్ చాలా సైలంట్ గా రెడీ అయిపోతోంది. బ్యాంకాక్ లో ఈ సినిమా షూటింగ్ చకచకా సాగిపోతోంది. కన్నడ, తెలుగు చిత్రాల నిర్మాత మనోహర్ బంధువు అయిన ఇషాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా సోదరి మన్నరా చోప్రా ఈ సినిమాకు హీరోయిన్ గా ఎంపికయింది. 

అంతకు ముందు మరో కొత్త హీరోయిన్ ను అనుకోవడం, కొంత వరకు షూట్ చేసి, ఆపేయడం తెలిసిందే. రోగ్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్న చార్మితో సరిపడక ఆ హీరోయిన్ బయటకు వచ్చిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు వేరే హీరోయిన్ తీసుకోవడంతో అవే నిజమని తేలింది. 

ఇదిలా వుంటే ఇటీవల చార్మి కి పూరి దూరం అయ్యారని,ఆ తరువాత ఆఫీసు సిబ్బందిని అందరినీ తొలిగించి ప్రక్షాళలన చేసారని వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు రోగ్ ప్రొడక్షన్ వ్యవహారాలు మాత్రం బ్యాంకాక్ లో కూడా చార్మే చూస్తొందని వార్తలు వినవస్తున్నాయి. నిజం నిలకడ మీద తెలియాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?