అమ్మాయిలూ.. కన్యగా ఉంటేనే మీకు స్కాలర్ షిప్పులు!

లైంగిక సంబంద వ్యాధులు.. అవాంఛిత గర్భం.. హెచ్ ఐవీ.. ఇప్పుడు ఆఫ్రికన్ యువత పాలిట అతి పెద్ద గండాలు. చాలా సులువుగా మెజారిటీ యువత వీటి బారిన పడుతోంది. ఏ దేశానికి అయినా యువత…

లైంగిక సంబంద వ్యాధులు.. అవాంఛిత గర్భం.. హెచ్ ఐవీ.. ఇప్పుడు ఆఫ్రికన్ యువత పాలిట అతి పెద్ద గండాలు. చాలా సులువుగా మెజారిటీ యువత వీటి బారిన పడుతోంది. ఏ దేశానికి అయినా యువత ప్రధానమైన బలం. అలాంటి యువత శారీరకం వాంఛలతో ఇలాంటి ప్రమాదాల బారిన పడుతుండటం అక్కడి ప్రభుత్వాలను కలవర పెడుతోంది. పిల్లలను ఈ విషయంలో నియంత్రించడం తల్లిదండ్రుల బాధ్యత. వారు వక్రమార్గం పట్టకుండా.. యుక్త వయసులో చదువు మీద వారి దృష్టి నిలిపేలా చూసుకోవడం వారి బాధ్యత. అయితే ఆఫ్రికన్ సంస్కృతిలో పిల్లలను నియంత్రించడం తల్లిదండ్రులకు కష్టం అయినట్టుగా ఉంది. దీంతో యువతలో విచ్చలవిడిగా లైంగిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. మైనర్లు గర్భం దాలుస్తున్నారు,. దీంతో ఆఫ్రికన్ సమాజాన్ని సంస్కరించే ప్రయత్నాలు చేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం నుంచి యువతకు అందే స్కాలర్ షిప్పుల విషయంలో ఒక ఆసక్తికరమైన మెలిక పెట్టింది. దీని ప్రకారం.. అమ్మాయిలకు వారు కన్యగా ఉన్నంత కాలమే.. ప్రభుత్వం తరపు నుంచి రాయితీలు, చదువు, పోషణ విషయంలో సహకారం అందిస్తామని దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్ బర్గ్ మేయర్ ప్రకటించారు. మరి లైంగిక సంబంధాలకు, ఉపకార వేతనాలకు ముడిపెట్టడం కొంత హేయమైన విషయమే. ప్రత్యేకించి భారతీయ కోణం నుంచి చూస్తే… ఇలాంటి రూల్స్ చాలా చాలా వింతగా అనిపిస్తాయి.

అయితే వక్రమార్గంలో పయనిస్తున్న తమ యువతను దారిలో పెట్టడానికి ఇంత కన్నా మార్గం లేదని జొహన్నెస్ బర్గ్ మేయర్ చెప్పారు. అమ్మాయిలు తాము కన్యలమని.. లైంగిక సంబంధాలకు దూరంగా ఉన్నామని ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తేనే వారు ప్రభుత్వ రాయితీలకు, ఉపకారవేతనాలకు అర్హత పొందుతారని మేయర్ స్పష్టం చేశారు. చిన్న వయసులో గర్భం దాల్చడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాల వల్ల అనారోగ్యం పాలవుతున్న వారిని నియంత్రించడానికే ఆ చర్యలు తీసుకొంటున్నట్టుగా వారు ప్రకటించారు. మరి అమ్మాయిల విషయంలో.. ఇలాంటి రూల్స్ పెట్టడం ఒక విధంగా వివక్ష అని చెప్పాలి. అమ్మాయిల వర్జినిటీ కి అయితే సులువుగా షరతులు పెట్టేసిన ప్రభుత్వం  అబ్బాయిల విషయంలో ఎందుకు షరతులు పెట్టడం లేదో!