సిద్దార్థే కళావతా?

ఈవారం విడుదలవుతోంది చంద్ర కళ సీక్వేల్ కళావతి. ఈ సినిమాలో త్రిష, హన్సిక, పూనం బజ్వా వున్నారు. మరి టైటిల్ రోల్ ఎవరిది? వీరిలో కళావతి ఎవరు? దీన్ని చాలా వరకు సస్పెన్స్ గా…

ఈవారం విడుదలవుతోంది చంద్ర కళ సీక్వేల్ కళావతి. ఈ సినిమాలో త్రిష, హన్సిక, పూనం బజ్వా వున్నారు. మరి టైటిల్ రోల్ ఎవరిది? వీరిలో కళావతి ఎవరు? దీన్ని చాలా వరకు సస్పెన్స్ గా వుంచారు నిర్మాత కుష్బూ..దర్శకుడు సుందర్. అయితే సినిమాలో కీలక ట్విస్ట్ వుందని..అది మాత్రమే కళావతి ఎవరన్నది రివీల్ చేస్తుందని వినికిడి. 

హీరో సిద్దార్థ ఈ సినిమాలో నటిస్తున్నారు. పార్ట్ వన్ లో ఆయన లేరు. కళావతి అన్నది సిద్దార్థతో ముడిపడిన టైటిల్ అని..సిద్దార్థే కళావతి అని సమాచారం. అదే నిజమైతే సినిమా కథ చాలా వైవిధ్యంగా వుండే అవకాశం వుంది. చంద్రకళ సీక్వెల్ గా కళావతికి మంచి బజ్ వుంది. మరి ఫలితం ఎలా వుంటుందో చూడాలి.