ఎన్టీఆర్ బయోపిక్ కు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఓం ప్రథమం అంటూ ఇప్పుడు ఓ నటి కోసం వెదుకులాట ప్రారంభమైంది. ఎన్టీఆర్ సతీమణి బసవరామతారకం పాత్రకు సూటయిన నటి కోసం వేట ప్రారంభమైంది.
అయితే అలా అని కాస్త పేరున్న నోటెడ్ ఫేస్ కోసం చూడడం లేదు. పక్కాగా బసవరామతారకం మాదిరి లుక్స్ వుండే వారికి ఫ్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఆర్జీవీ వెదుకులాడి సేమ్ టు సేమ్ ఫేస్ వున్న వారిని తీసుకువచ్చినట్లుగా అన్నమాట.
తేజ కూడా అదే విథంగా చూస్తున్నారు. ఆ మాటకు వస్తే ఒక్క ఎన్టీఆర్, బాలయ్య పాత్రలు మినహా మిగిలిన కీలకపాత్రలు అన్నింటికీ పక్కా ఫేస్ లు సెట్ అయ్యే కొత్త నటులనే తీసుకోవాలన్నది దర్శకుడు తేజ ఆలోచనగా వుంది.
అలా అయితేనే బయోపిక్ రక్తి కడుతుంతదని, బయోపిక్ ఫీల్ వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు బాలయ్య కూడా ఆమోద ముద్ర వేసినట్లు వినికిడి. అందువల్ల ఎవరైనా అచ్చంగా బసవతారకం, చంద్రబాబు, మాదిరిగా వుంటే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చేమో తేజను కలిసి?