మొదటి రోజు కుమ్మేసింది

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9వేల స్క్రీన్స్ పై అట్టహాసంగా విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ సినిమా మొదటి రోజు కుమ్మేసింది. దాదాపు ప్రతి థియేటర్ 100శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే క్యూరియాసిటీ,…

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9వేల స్క్రీన్స్ పై అట్టహాసంగా విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ సినిమా మొదటి రోజు కుమ్మేసింది. దాదాపు ప్రతి థియేటర్ 100శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే క్యూరియాసిటీ, కనీవినీ ఎరుగని రీతిలో చేసిన పబ్లిసిటీ, పార్ట్-1 సృష్టించిన ప్రభంజనం.. ఇలా అన్నీ కలిసి బాహుబలి-2 చిత్రాన్ని ఎవరెస్ట్ శిఖరంపై నిలబెట్టాయి. ఇంత భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఈ దశాబ్ద కాలంలో ఇంకోటి లేదనే చెప్పాలి. అందుకే మొదటి రోజు బాహుబలి-2 సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

తాజా సమచారం ప్రకారం.. బాహుబలి-2 సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి 50కోట్ల రూపాయల వసూళ్లు అంచనా వేస్తున్నారు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ ను దాటేసింది. గురువారం ప్రివ్యూస్ కే అమెరికా, కెనడా దేశాల్లో ఈ సినిమాకు 2.5 మిలియన్ డాలర్లు వచ్చాయి. అన్ని థియేటర్ల వసూళ్లు అధికారికంగా వస్తే లెక్క 3 మిలియన్ దాటే ఛాన్స్ ఉంది. 

ఇక వసూళ్లకు ఎంతో కీలకమైన బాలీవుడ్ నుంచి కూడా భారీ వసూళ్లు రాబట్టే దిశగా దూసుకుపోతోంది బాహుబలి-2. బాలీవుడ్ లో ఈ సినిమాకు తొలిరోజు 40కోట్ల రూపాయలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా బాహుబలి-2 సినిమా భారీ ఎత్తున విడుదలైంది. సో.. మొదటి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ దాదాపు 120కోట్ల రూపాయల వసూళ్లు అంచనా వేస్తున్నారు.