తైమూర్‌ఖాన్‌కి జన్మనిచ్చాక బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్, తిరిగి సినిమాల్లో నటించేందుకు పెద్దగా టైమ్ తీసుకోకపోవచ్చునట. ఈ విషయాన్ని కరీనాకపూర్ సన్నిహితులే వెల్లడిస్తున్నారు. డెలివరీ అయిన రెండు మూడు రోజుల్లోనే బెబో మీడియా ముందుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. భర్త, కుమారుడితో కలిసి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన బెబో, ఈ క్రమంలో మీడియాకి, అభిమానులకి అభివాదం చేస్తూ కెమెరా కళ్ళకి చిక్కింది.
మరోపక్క, కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న అనంతరం బెబో మీడియా ముందుకు రాబోతోందట. సినిమా గురించి కాదు, తన కుమారుడు తైమూర్‌ఖాన్ పేరుకు సంబంధించిన వివాదంపై స్పందించేందుకోసమట. తైమూర్‌ఖాన్ అంటే చరిత్రలో నెత్తుటేరులు పారించిన క్రూర చక్రవర్తి పేరు అందరికీ గుర్తుకొస్తోంది. మరీ ముఖ్యంగా, హిందువుల్ని తైమూర్‌ఖాన్ ఊచకోత కోశాడు గనుక, అలాంటి వ్యక్తి పేరెలా పెడ్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
'ఏ పేరు పెట్టాలన్నది తల్లిదండ్రుల ఇష్టం.. మీరెవరు ప్రశ్నించడానికి..' అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరీనా – సైఫ్‌లకు అండగా నిలిచారనుకోండి.. అది వేరే విషయం. అయితే తనంతట తానుగా మీడియా ముందుకొచ్చి, తైమూర్‌ఖాన్‌పై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇవ్వదలచుకున్నట్లు కరీనా ఆల్రెడీ సన్నిహితులకు సమాచారమిచ్చింది. వచ్చేవారంలోనే కరీనా, మీడియా ముందుకొస్తుందట.. తన భర్త సైఫ్ అలీఖాన్‌తో కలిసి.
ఇక, సినిమాలపైనా బెబో క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రెగ్నెంట్‌గా వున్నప్పుడూ, బాలీవుడ్ పార్టీల్లో చురుగ్గా తిరిగిన కరీనా, అతి త్వరలోనే సినిమాల్లో నటించే అవకాశాలున్నాయన్నది ఆమె సన్నిహితుల నుంచి మీడియాకి అందుతున్న లీకుల సారాంశం.