భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఫంక్షన్ అద్భుతంగా హైదరాబాద్ లో జరిగింది. ఇప్పటి వరకు ఏ సినిమా ఫంక్షన్ ఆ రేంజ్ లో జరగలేదు. మళ్లీ మరో ఫంక్షన్ ను భరత్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈసారి వేదికగా తిరుపతిని ఎంచుకున్నారు. ఈనెల 27న తిరుపతిలో చాలా భారీగా సభ జరగబోతొంది. ఈ సభ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ఇదిలా వుంటే మహేష్ కు ఓ చిన్న సరదా వుంది. తన హిట్ సినిమాలను విజయవాడ మెయిన్ థియేటర్లలో చూడాలన్నది ఆ సరదా. గతంలో చాలా సినిమాలను అలాగే విజయవాడ వెళ్లి చూసాడు.
ఈసారి కూడా విజయవాడ వెళ్లి థియేటర్లలో ప్రేక్షకుల నడుమ చూడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అది సైలెంట్ గా వెళ్లి వస్తాడా? లేక, అందరికీ తెలిసేలా వెళ్లి వస్తాడా? అన్నది ఇంకా తెలియడం లేదు. ఈ విషయంలో నిర్ణయం మహేష్ కే వదిలేసారట.
తిరుపతి తరువాత విశాఖలో కూడా ఫంక్షన్ చేయాలన్న ఆలోచన నిర్మాతలకు వుంది. అయితే దానిపై ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. ఓవర్ సీస్ లో, డొమెస్టిక్ మార్కెట్ లో కూడా వీకెండ్ తరువాత స్టడీగా వుంది.