బెజవాడ మెగా ఫంక్షన్ క్యాన్సిల్?

మెగాఫంక్షన్ ఖైదీ నెంబర్ 150 ప్రీ సక్సెస్ మీట్ పై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ ఈ నెల నాలుగున విజయవాడలో జరగాల్సి వుంది. ఈ మేరకు ఫంక్షన్ ఆర్గనైజర్లు విజయవాడలో గడచిన…

మెగాఫంక్షన్ ఖైదీ నెంబర్ 150 ప్రీ సక్సెస్ మీట్ పై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ ఈ నెల నాలుగున విజయవాడలో జరగాల్సి వుంది. ఈ మేరకు ఫంక్షన్ ఆర్గనైజర్లు విజయవాడలో గడచిన రెండు మూడు రోజులుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే విజయవాడలో ఈ ఫంక్షన్ జరగడం తెలుగుదేశం వర్గాలకు అంతగా ఇష్టం లేదని తెలుస్తోంది. విజయవాడలో ఈ ఫంక్షన్ జరిగే స్టేడియం ఇలాంటి వాటికి ఇవ్వడానికి లేదని కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్లాలని కొందరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో హీరో చిరంజీవి ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్న మంత్రి గంటా శ్రీనివాసరావు రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పెద్దలతో ఆయన రాయబారాలు నడుపుతున్నట్లు వినికిడి. ఇదిలా వుంటే విజయవాడలో వీలు కాని పక్షంలో 7న గుంటూరులో ఖైదీ నెం 150 సక్సెస్ మీట్ జరపాలని మెగాక్యాంప్ ఆల్రెడీ డిసైడ్ అయినట్లు వినికిడి. అసలే వంగవీటి సినిమా కారణంగా దక్షిణ కోస్తాలోని కాపుల్లో కాస్త అసంతృప్తి ప్రారంభమయింది. ఇప్పుడు ఇది కూడా తోడయితే కాపుల వ్యవహారం వేరుగా వుంటుంది.

గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం ను ఫంక్షన్ నిర్వహణకు ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.