బెల్లంకొండతో ‘నక్కిన’

మొత్తానికి ఓ మ్యాచింగ్ కుదిరింది అనుకోవాలి. హలోగురూ ప్రేమకోసమే సినిమా తరువాత సరైన సినిమా కోసం చూస్తున్న డైరక్టర్ నక్కిన త్రినాధరావుకు, రాక్షసుడు సినిమా తరువాత ఏం చేయాలి అని చూస్తున్న బెల్లంకొండ సాయి…

మొత్తానికి ఓ మ్యాచింగ్ కుదిరింది అనుకోవాలి. హలోగురూ ప్రేమకోసమే సినిమా తరువాత సరైన సినిమా కోసం చూస్తున్న డైరక్టర్ నక్కిన త్రినాధరావుకు, రాక్షసుడు సినిమా తరువాత ఏం చేయాలి అని చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీ కుదిరినట్లే వుంది. నిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత బెక్కం వేణుగోపాల్, మరోకరు కలిసి ఓ ప్రాజెక్టుకు పౌరోహిత్యం చేసినట్లు వినిపిస్తోంది. మరి నిర్మాతగా ఎవరి పేరు వుంటుందో చూడాలి.

సినిమా అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో పక్కా అని తెలుస్తోంది. ఫన్ జోనర్ లోకి రావాలని బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నం. అందుకే తేజ డైరక్షన్ లోని సీత సినిమా చేసాడు. కానీ స్క్రిప్ట్ విన్నది ఒకటి, సినిమా వేరొకటి అయింది. ఫలితం చేదుగా మిగిలింది.

అందుకే ఈసారి నక్కిన త్రినాధరావుతో ట్రయ్ చేస్తున్నారు. నక్కిన త్రినాధరావు ఇప్పటివరకు మూడు సినిమాలు చేసి, ఫన్ జోనర్ లో తనకు పట్టు వుందని నిరూపించుకున్నారు. అందువల్ల ఈ నాలుగో సినిమా బెల్లంకొండ కోరిక తీరుస్తుందనే అనుకోవాలి.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!