బెల్లంకొండ-కాంబినేషన్లకు స్వస్తి

ఉవ్వెత్తున ఎగిసినట్లు, భారీ సినిమాలతో సర్రున టాలీవుడ్ లోకి వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్, భీమినేని శ్రీనివాసరావు, బోయపాటి శ్రీనివాస్, శ్రీవాస్ ఇలా సీనియర్లతో భారీ సినిమాలు చేసాడు. కానీ నిర్మాతలకు నష్టాలే.…

ఉవ్వెత్తున ఎగిసినట్లు, భారీ సినిమాలతో సర్రున టాలీవుడ్ లోకి వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్, భీమినేని శ్రీనివాసరావు, బోయపాటి శ్రీనివాస్, శ్రీవాస్ ఇలా సీనియర్లతో భారీ సినిమాలు చేసాడు. కానీ నిర్మాతలకు నష్టాలే. అది వేరే సంగతి. కానీ హీరోకి మార్కెట్ వచ్చింది. కానీ ఇప్పుడు లైనప్ లో వున్న సినిమాలు చూస్తుంటే డిఫరెంట్ గా వుంది వ్వవహారం. నేనేరాజు నేనేమంత్రి అనే ఒక్క సినిమా మినహా గడచిన అయిదారేళ్లలో ఒక్క హిట్ లేని తేజతో ఓ సినిమా చేస్తున్నాడు.

అలాగే అసలు హిట్ రికార్డే లేని రమేష్ వర్మతో ఇప్పుడు ఓ సినిమా ప్రకటించాడు. అది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అంట. యూత్ ఫుల్ లవ్ స్టోరీలు అది కూడా సూపర్ గా వుంటే తప్ప, జనాలు యాక్సెప్ట్ చేయడంలేదు. అలాంటిది మేకింగ్ కు చిరకాలంగా దూరంగా వున్న రమేష్ వర్మతో లవ్ స్టోరీ అంటే మరి ఏ విషయంలో భరోసాతో ముందుకు వెళ్తున్నారో?

పైగా ఇప్పుడు జనాలు కాంబినేషన్ వుంటే తప్ప థియేటర్ కు రావడం లేదు. బెల్లంకొండ-రమేష్ వర్మ కాంబినేషన్ అంటే ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. బెల్లంకొండ మార్కెట్ నలభైకోట్ల మేరకు వుంది అని గత సినిమాలు ప్రూవ్ చేసాయి. కానీ అక్కడ డైరక్టర్ తోడు వుంది. డైరక్టర్ తోడు లేకుండా నలభై కోట్ల మార్కెట్ అన్నది పాజిబుల్ కాదు.

తేజ, రమేష్ వర్మల వంటి కాంబినేషన్ లో నలభైకోట్ల బిజినెస్ అవుతుందా? తేజ లాస్ట్ సినిమా నేనేరాజు నేనే మంత్రికి రానా లాంటి హీరో, సురేష్ లాంటి బ్యానర్ బ్యాకింగ్ వుండే గట్టిగా 20 కోట్ల బిజినెస్ చేయలేకపోయారు.

రమేష్ వర్మ చివరగా రెండు మూడేళ్ల క్రితం అందించిన నాగశౌర్య అబ్బాయితో అమ్మాయి సినిమా డిజాస్టర్. మరి ఇప్పుడు ఈ సినిమాకు మార్కెట్ ఎలా వుంటుందో? మరి ఏమిటో బెల్లంకొండ స్ట్రాటజీ? ఇదిలా వుంటే హిట్ లు ఇచ్చిన డైరక్టర్లు కూడా ఖాళీగా వున్న రోజుల్లో చేతిలో హిట్ లేకుండా, ఇండస్ట్రీలో మేకింగ్ కు దూరంగా వున్న రమేష్ వర్మకు మూడు సినిమాలు రావడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

కోనేరు హవీష్ హీరోగా వేరే దర్శకుడితో 7 అనే మూవీని నిర్మిస్తున్నారు. హవీష్ సినిమా అంటే బ్యాకెండ్ లో పెట్టుబడి కోనేరు ఫ్యామిలీదే వుంటుందని ఇండస్ట్రీ టాక్. ఇక అదే కోనేరు సత్యనారాయణ నిర్మాతగా మరో రెండు సినిమాలను కూడా రమేష్ వర్మ ప్రకటించారు.

వీటిలో ఒకటి రమేష్ వర్మ దర్శకత్వంలో, మరోటి ఆయన కథ అందిస్తూ. మొత్తంమీద రమేష్ వర్మ దగ్గర ఏదో చమక్కు వుంది. ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి