బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటేనే ఫ్యాడింగ్ అంతా భారీగా వుండేలా చూస్తారు. సినిమా భారీతనమే కాకుండా, టెక్నికల్ టీమ్, స్టార్ కాస్ట్ కాస్త అంతా కేర్ ఫుల్ గా ప్లాన్ చేస్తారు.
అందువల్లే కాస్త మార్కెట్ ను బలంగా, స్థిరంగా వుంచుకోగలిగాడు. ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్న సినిమాకు విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ ను తీసుకున్నారు. కొత్త దర్శకుడు, కొత్త బ్యానర్ లో చేస్తున్నఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు.
ఈ సినిమాలో విలన్ పాత్ర బలంగా వుంటుంది. అందుకే నీల్ నితిన్ ను తీసుకున్నారు. ఇప్పటికే ఇతగాడు తెలుగులో ప్రభాస్ సాహో సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్ కు చెందిన ఈ సినిమాలో నితిన్ ముఖేష్ పాత్ర చాలా హైలైట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
కొత్త దర్శకుడు శ్రీనివాస్ అందిస్తున్న ఈ సినిమా షూట్ సగానికి పైగానే ఫినిష్ అయిపోయింది. మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం సినిమా జూన్ లో విడుదలవుతోంది.