బెల్లంకొండపై వదంతులు

టాలీవుడ్ లో మంగళవారం రెండు వదంతులు గుప్పుమన్నాయి. ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ, ఈ వదంతులపై మీడియా జనాలు కూడా ఆసక్తిగా ఆరాలు తీసారు. అందులో ఒకటి నిర్మాత బెల్లంకొండ ఐపి పిటిషన్…

టాలీవుడ్ లో మంగళవారం రెండు వదంతులు గుప్పుమన్నాయి. ఎంతవరకు నిజం అన్నది తెలియదు కానీ, ఈ వదంతులపై మీడియా జనాలు కూడా ఆసక్తిగా ఆరాలు తీసారు. అందులో ఒకటి నిర్మాత బెల్లంకొండ ఐపి పిటిషన్ పెడతారని. 80 కోట్ల మేరకు అప్పులు వున్నాయని, అందుకే ఆయన ఐపి పెడతారని వదంతులు గుప్పుమన్నాయి. 

అయితే బెల్లంకొండ ధైర్యం, వ్యవహార శైలి తెలిసినవారు వాటిని ఇట్టే కొట్టిపారేస్తున్నారు. పైగా ఆయన అప్పులు అన్నీ ఆయనకు బాగా సన్నిహితులే అని, అందువల్ల ఇబ్బంది కర పరిస్థితులు తలెత్తవని అంటున్నారు. పైగా కొడుకును హీరోగా రెండోసినిమా ప్రారంభించిన నేపథ్యంలో ఇలాంటి పిచ్చిపని చేయరని వాదిస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్టును సేఫ్ గా వేరే వాళ్ల చేతిలో పెట్టారని మరోటాక్.

ఇదిలా వుంటే తనకు ఇంకా కొంత రెమ్యూనిరేషన్ బాకీ అని రభస సినిమా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చాంబర్ లో పిర్యాదు చేసినట్లు మరో వార్త గుప్పు మంది. ఈ విషయమై నిజానిజాలు తెలుసుకునేందుకు శ్రీనివాస్ ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.