‘బెల్లంకొండ’ స్ట్రాటజీ అదేనా?

కొడితే గట్టిగా కొట్టాలి. అప్పుడే సౌండ్ రీసౌండ్ అవుతుంది. ఇదే ప్లాన్ తో వెళ్తున్నట్లుంది హీరో బెల్లంకొండ సాయి..అతని తండ్రి సురేష్. సాయి లేటెస్ట్ సినిమా అల్లుడు అదుర్స్.  Advertisement ఈ సినిమా సంక్రాంతి…

కొడితే గట్టిగా కొట్టాలి. అప్పుడే సౌండ్ రీసౌండ్ అవుతుంది. ఇదే ప్లాన్ తో వెళ్తున్నట్లుంది హీరో బెల్లంకొండ సాయి..అతని తండ్రి సురేష్. సాయి లేటెస్ట్ సినిమా అల్లుడు అదుర్స్. 

ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోందని ఈ రోజు ప్రకటించేసారు. అదే రోజు హీరో రామ్ రెడ్ సినిమా వుంది. పైగా ఇస్మార్ట్ శంకర్ ఊపులో వున్నాడు రామ్. ఆ సినిమా మీద వేయడంలో స్ట్రాటజీ వేరే అని తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో దిగడం, సరాసరి రామ్ లాంటి యంగ్ హీరో మీద దిగడంతో ఫైట్ రంజుగా వుంటుంది. హిట్ కొట్టడం ఒక ఎత్తు. కాంపిటీషన్ లో హిట్ కొడితే ఆ కిక్కు వేరు. 

అదే బెల్లంకొండ స్ట్రాటజీలా కనిపిస్తోంది.  పైగా బెల్లంకొండ సురేష్ కు స్రవంతి రవికిషోర్ కు అంతగా పొసగదన్న టాక్ ఇండస్ట్రీలో వుంది. రవికిషోర్ స్వంత సినిమా మీద తన కొడుకు సినిమా వేసి తనేంటో చూపించాలని కూడా అనుకున్నా, అనుకుని వుండొచ్చు.

మొత్తం మీద అల్లుడు అదుర్స్ సంక్రాంతి ఎంట్రీ టోటల్ సీన్ ను మార్చేసేలా కనిపిస్తోంది.

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా ?