‘క్రాక్’ ఫార్వార్డ్ స్టెప్?

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు దాదాపు అన్నీ మాంచి బజ్ వున్నవే. వాటిల్లో క్రాక్ కు మాంచి అడ్వాంటేజ్ వుంది. ఎందుకంటే పక్కా మాస్ సినిమా. సంక్రాంతికి వస్తున్న ఏకైక మాస్ సినిమా. విజయ్ మాస్టర్…

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు దాదాపు అన్నీ మాంచి బజ్ వున్నవే. వాటిల్లో క్రాక్ కు మాంచి అడ్వాంటేజ్ వుంది. ఎందుకంటే పక్కా మాస్ సినిమా. సంక్రాంతికి వస్తున్న ఏకైక మాస్ సినిమా. విజయ్ మాస్టర్ కూడా వుంది కానీ, ఇది మన హీరో సినిమా అన్నది అదనపు అడ్వాంటేజ్.

అయితే పండగకు 13,14,15 తేదీలు అప్పుడే పంచేసుకున్నారు. వీటిలో 14 క్రాక్ అని ఇన్నాళ్లు ఫిక్స్ అయ్యారు. అయితే ఎప్పుడు అయితే అల్లుడు అదుర్స్ 15న విడుదల అని డేట్ ప్రకటించారో. క్రాక్ నిర్మాతల ఆలోచన మారినట్లు కనిపిస్తోంది. 

థియేటర్ల తొడతొక్కిడిలో ఇరుక్కునే బదులు, రెండు రోజలు ముందుగా అంటే 12న వస్తే ఎలా వుంటుదీ అని ఆలోచిస్తున్నారు. 12 న అంటే భోగి ముందు రోజు కాబట్టి ఓపెనింగ్స్ బాగుంటాయి. పైగా సోలో ఓపెనింగ్స్ వస్తాయి. ఆ మర్నాటి నుంచి థియేటర్లు షేర్ చేసుకుంటూ వెళ్లాల్సిందే.

ఈ మేరకు హీరోతో సిటింగ్ వేసి, నిర్ణయించే ప్రయత్నాల్లో వున్నారు. క్రాక్ కాపీ రెడీ అయిపోయింది. సెన్సారు జరగాలి. థియేటర్ హక్కులు ముందే ఇచ్చేసారు. నాన్ థియేటర్ లో డిజిటల్, శాటిలైట్ కావాల్సి వుంది. 

ఈ రెండూ కలిసి 15 కోట్ల మేరకు బేరాలు సాగుతున్నాయి. ఇప్పటికే హిందీ డబ్బింగ్ 11 కోట్లకు ఇచ్చేసారు. ఆ విధంగా నాన్ థియేటర్ నే దాదాపు 26 కోట్లకు పైగా మార్కెట్ అవుతోంది.

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా ?