సంపత్ నంది పరిస్థితి చూస్తే జాలేస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే ఆఫర్ అందుకొని అందరికీ షాక్ ఇచ్చాడు సంపత్. అయితే ఆ సినిమా ఎంతకీ ముందుకు కదలడం లేదు. మొన్నటి వరకూ కథలో మార్పులు చేయించిన పవన్ ఇప్పుడు కథనే మార్చేయమంటున్నాడు. దాంతో.. సంపత్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. నిజానికి సంపత్‌నంది గబ్బర్ సింగ్ 2 చేయాలనే ఉద్దేశంతో పవన్‌ని కలవలేదు.
అతను తయారు చేసుకొన్న కథ వేరు. అది బెంగాల్ టైగర్ అనే మాంఛి మాసీ కథ. కానీ పవన్ మాత్రం సంపత్ మీద నమ్మకంతో గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్ట్ అప్పగించాడు. ఇప్పుడు అదీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ బెంగాల్ టైగర్ పట్టాలకెక్కింది.
సంపత్ రాసుకొచ్చిన బెంగాల్ టైటర్‌కి పవన్ ఓకే చెబుతాడా? లేదంటే అదీ పక్కన పెట్టి కొత్త కథ రాయమంటాడా? అనేదే ఎవరికీ తెలియడం లేదు. పవన్, సంపత్ నంది సినిమా మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉందనే సంగతి క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.