బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అందరికీ సింహానే గుర్తొస్తుంది. అందుకే లెజెండ్‌పై కూడా ఆ స్థాయి అంచనాలున్నాయి. టీడీపీ ప్రచార అస్త్రంగా భావిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28న గానీ, ఏప్రిల్ 4నగానీ లెజెండ్ రాక ఖాయమైంది. ఈలోగా శాటిలైట్ రైట్స్ కోసం కూడా పోటీ ఎక్కువైంది. రూ.8 కోట్లకు ఈసినిమా కొంటామని జెమిని, మా టీవీ ముందుకొచ్చాయి.
అయితే చిత్రబృందం రూ.9 కోట్లు డిమాండ్ చేస్తోంది. ఈ ఫిగర్‌కి దగ్గరకొచ్చేవాళ్లకే లెజెండ్ సొంతం కానుంది. రెండ్రోజుల్లో ఎవరో ఒకరు లెజెండ్‌ని ఎగరేసుకుపోవడం ఖాయమని టాక్. మరోవైపు లెజెండ్ కి అన్ని వైపుల నుంచీ మంచి బిజినెస్ ఆఫర్లు అందుతున్నాయి. విడుదలకు ముందే భారీ ప్రాఫెట్ని పొందడం ఖాయంగా అనిపిస్తోంది. వన్ వల్ల పోయిన సొమ్మంతా లెజెండ్ రాబట్టాలని 14 రీల్స్ సంస్థ ఆశలు పెట్టుకొంటోంది. ఏం జరుగుతుందో చూడాలి.