ఈ మెగా హీరో కాస్త తగ్గితే బెటరేమో..?

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత సక్సెస్ రేట్ ఉందనేది ఇంపార్టెంట్. ఇంత చిన్న లాజిక్ ను సాయిధరమ్ తేజ్ ఎలా మిస్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. ఓ వైపు ఫ్లాపులు, డిజాస్టర్లు…

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత సక్సెస్ రేట్ ఉందనేది ఇంపార్టెంట్. ఇంత చిన్న లాజిక్ ను సాయిధరమ్ తేజ్ ఎలా మిస్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. ఓ వైపు ఫ్లాపులు, డిజాస్టర్లు ఒకదానిపై ఒకటి వస్తుంటే.. మరోవైపు వరుసగా సినిమాలు ప్రకటించుకుంటూ పోతున్నాడు తేజు.

ఫ్లాపులొచ్చినప్పుడు ఎవరైనా కాస్త తగ్గుతారు. తమ సినిమాల ఎంపికలో ఎక్కడ తేడా కొడుతుందో అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సెలక్షన్ విషయంలో ఆత్మావలోకనం చేసుకోవాలంటే ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకోకపోయినా, ఓ చిన్నపాటి విరామమైనా కావాలి. అలాంటి గ్యాప్ ఇప్పుడు తేజూకు చాలా అవసరం. 

కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం గ్యాప్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు. ఇప్పటికే వినాయక్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన ఈ మెగా హీరో.. త్వరలోనే కరుణాకరన్ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇవికాకుండా తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. 

గతంలో తనకు విన్నర్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి మరో అవకాశం ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. భగవాన్, పుల్లారావు నిర్మాణంలో త్వరలోనే ఈ సినిమా ప్రారంభంకాబోతోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాయిధరమ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకొని కెరీర్ ను ఎనలైజ్ చేసుకుంటే మంచిదేమో..