సరైనోడు సినిమాతో దర్శకుడు బోయపాటికి మెగా క్యాంప్ మీద ఆసక్తి పెరిగిపోయింది. అప్పటి నుంచి ఎలాగైనా రామ్ చరణ్ తో, చిరంజీవితో సినిమా చేయాలని ట్రయ్ చేస్తున్నారు. చిరుతో సినిమా ఫైనల్ అనుకున్న టైమ్ లో సై రా ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. దాంతో రామ్ చరణ్ మీద దృష్టి పెట్టారు బోయపాటి. మాంచి లైన్ తయారు చేసి వినిపించారని వినికిడి.
ఆఖరికి ఇప్పడు ప్రాజెక్టు ఫైనల్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ధృవ సినిమాను నిర్మించాల్సిన నిర్మాత డివివి దానయ్య, ఆ సినిమాను చరణ్ కోరిక మేరకు అరవింద్ కు ఇచ్చేసారు. అందువల్ల చరణ్ ఓ సినిమా చేయాల్సి వుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అలా దానయ్యకే వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చేస్తున్న రంగస్థలం 1985 కాకుండా చరణ్ కు కొరటాల శివ ప్రాజెక్ట్ కమిట్ మెంట్ వుంది. కానీ కొరటాల శివ మార్చి వేళకు కానీ ఖాళీ కారు. రంగస్థలం ప్రాజెక్టు మరో నెలలో ఫినిష్ అయిపోతుందని తెలుస్తోంది. అందువల్ల ఈ గ్యాప్ లో బోయపాటి సినిమా చేసే అవకాశం వుందేమో అన్న టాక్ వినిపిస్తోంది.
ఏమైనా మెగా క్యాంప్ లో మరో సినిమా చేయాలన్న బోయపాటి కోరిక నెరవేరినట్లే అనుకోవాలి. దీని తరువాత మళ్లీ బాలయ్య దగ్గర సినిమా రెడీగా వుంది. ఆ తరువాత మెగాస్టార్ ప్రాజెక్టు వుండనే వుంది. బోయపాటి లైనప్ బాగానే వున్నట్లుంది.