భాగమతి-కేరాఫ్ హర్రర్ జోనర్

చాలా కాలంగా అనుష్క అభిమానులు వేచి చూస్తున్న సినిమా భాగమతి. అయితే టిపికల్ ప్రొడక్షన్ కావడం, బాహుబలి 2పనులు అడ్డం పడడం, అన్నింటికి మించి సీజీ వర్క్ కాస్త హెవీగా వుండడం వల్ల ఆలస్యమవుతూ…

చాలా కాలంగా అనుష్క అభిమానులు వేచి చూస్తున్న సినిమా భాగమతి. అయితే టిపికల్ ప్రొడక్షన్ కావడం, బాహుబలి 2పనులు అడ్డం పడడం, అన్నింటికి మించి సీజీ వర్క్ కాస్త హెవీగా వుండడం వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. విడుదల మరో నెలరోజుల దూరంలో వుండగా టీజర్ ఇప్పుడు విడుదలయింది.

ముఫైమూడు సెకెండ్ల టీజర్ లో జస్ట్ జోనర్ ను టచ్ చేసారంతే. సినిమా హర్రర్ జోనర్ అన్నది తెలిసిందే అయినా, దాన్ని మరోసారి క్లియర్ గా చెప్పారు టీజర్ లో. ఈ సినిమాకోసం భారీ భవంతి సెట్ ఒకటి వేసారు. ఆ భవంతినే టీజర్ లో చూపించారు. ఫస్ట్ లుక్ లో అనుష్క చేతిలో మేకులతో గోడకు ఫిక్సయినట్లు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో అనుష్క తనకు తానే చేతిలో మేకులు కొట్టుకోవడం చూపించారు. 

సో ఆ విధంగా కాస్త ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసారు. టీజర్ నిడివి మరో పది సెకెండ్లు వుండి వుంటే మరింత బాగుండేది. ముఫై మూడు సెకెండ్లలో ఇంతకన్నా చూపించడం కష్టం. ట్రయిలర్ జనవరి ఫస్ట్ వీక్ లో విడుదలవుతుంది.