భాగమతి స్టడీ వీకెండ్

భాగమతి సినిమా మొత్తానికి గట్టెక్కేసింది. సినిమా సెకెండ్ డే స్టడీగా వుండి మంచి కలెక్షన్లు నమోదు చేసింది. రెండో రోజు అయిన శనివారం, మూడో రోజైన ఆదివారం మార్నింగ్, మాట్నీ షోలు స్టడీగా వున్నాయి.…

భాగమతి సినిమా మొత్తానికి గట్టెక్కేసింది. సినిమా సెకెండ్ డే స్టడీగా వుండి మంచి కలెక్షన్లు నమోదు చేసింది. రెండో రోజు అయిన శనివారం, మూడో రోజైన ఆదివారం మార్నింగ్, మాట్నీ షోలు స్టడీగా వున్నాయి.

దీంతో సినిమా మార్కెట్ మీద మంచి అంచనాలే కలుగుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో పది నుంచి పన్నెండు కోట్ల షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. సెకెండ్ డే కృష్ణా లాంటి తక్కువగా నమోదయ్యే జిల్లాలోనే 23లక్షల వరకు షేర్ వచ్చింది.

ఉత్తరాంధ్ర రెండు రోజులకు కోటి షేర్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. రెండో రోజు వసూలయిన షేర్ మూడున్నర కోట్ల మేరకు వుంటుందని యూనిట్ వర్గాల బోగట్టా.

సాధారణంగా ఫస్ట్ వీకెండ్ వసూళ్లకు డబుల్ మొత్తం ఎర్నింగ్స్ వుంటాయని టాలీవుడ్ జనాల అంచనా. ఆ లెక్కన భాగమతి 20కోట్ల షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం థియేటర్లలో మరో సరైన సినిమాలేదు. రెండవ తేదీ వరకు ఇదే సినిమా. అదేరోజు రెండు సినిమాలు వున్నాయి. వాటి మంచి చెడ్డల బట్టి భాగమతి ఫుల్ స్టామినా బయటకు వస్తుంది. మిర్చి తరువాత కాస్త హయ్యస్ట్ బడ్జెట్ లో యూవీ తీసిన సినిమా భాగమతే కావడం విశేషం.