ఇంటిలిజెంట్ సినిమా కోసం బాలయ్య, ప్రభాస్ లాంటి వాళ్లు తమ టైమ్ కేటాయించడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్మాత సి కళ్యాణ్ కోసమే బాలయ్య టీజర్ విడుదలకు ఆసక్తి చూపించారని అందరూ అనుకున్నారు.
కానీ కేవలం అది ఒక్కటే కాదట. ఇంటిలిజెంట్ సినిమాకు మాగ్జిమమ్ బజ్, పబ్లిసిటీ తీసుకురావడానికి దర్శకుడు వివి వినాయక్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
సరైన మార్కెట్ లేని సాయిధరమ్ తేజ మీద, కేవలం వినాయక్ ను నమ్ముకుని 32కోట్లు పెట్టేసారు నిర్మాత సి కళ్యాణ్. అందువల్ల ఎలాగైనా సినిమాకు మాంచి ఓపెనింగ్స్ తీసుకురావాలి. ఆ తరువాత సినిమాను నిలబెట్టి గట్టెక్కించాలి. పైగా సినిమా చాలా టఫ్ కాంపిటీషన్ లో వస్తోంది.
అందుకే వినాయక్ పర్సనల్ గా ప్రచార కార్యక్రమాల్ని ప్లాన్ చేస్తున్నారట. ఆయన మాట మేరకే బాలయ్య, ప్రభాస్ ఓకె అన్నారని తెలుస్తోంది. ఇంకా ఇలాంటి సప్రైజ్ లు మరికొన్ని వినాయక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.