పాపం.. 'భరత్ అనే నేను' సినిమా స్టార్ట్ చేసినప్పట్నుంచి ఏదో ఒక అడ్డంకి. ఫస్ట్ షెడ్యూల్ నుంచే ఈ సినిమా వాయిదాల పాట పుచ్చుకుంది. అప్పట్లో స్పైడర్ సినిమా షూటింగ్ లో జాప్యం కారణంగా భరత్ అనే నేను షెడ్యూల్స్ తెగ సాగాయి. ఆ వాయిదాలు ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉన్నాయి.
లెక్క ప్రకారం యూనిట్ వచ్చే వారం లండన్ వెళ్లాలి. సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ అది. ఎందుకంటే.. మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్నారై రిటర్న్ గా కనిపించబోతున్నాడు. ఆ మాంటేజ్ షాట్స్ తో పాటు కొన్ని ప్రత్యేకమైన ఎమోషనల్ సన్నివేశాల్ని లండన్ లోనే తీయాల్సి ఉంది. కానీ ఇప్పుడా షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది.
ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాకు సంబంధించి హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారు. రామానాయుడు స్టుడియోస్ లో వేసిన ఓ సెట్ లో మహేష్ బాబుపై యాక్షన్ ఎపిసోడ్ ఒకటి చిత్రీకరిస్తున్నారు. ఈనెల 9వరకు ఆ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత మహేష్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడట. ఆ తర్వాత లండన్ షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తారు.
ఈ సినిమాను ఏప్రిల్ 20న థియేటర్లలోకి తీసుకొస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల జరిగిన పరిణామాలు, మిగతా సినిమాల విడుదల తేదీల్ని దృష్టిలో పెట్టుకుంటే రిలీజ్ డేట్ ను వాయిదా వేసే ఛాన్స్ లేదు. సో.. టాకీతో పాటు సాంగ్స్ ను వీలైనంత తొందరగా పూర్తిచేసే ఉద్దేశంతో.. లండన్ షెడ్యూల్ నే కాస్త పొడిగించి 2పాటల్ని కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ షెడ్యూల్ ఎప్పుడనేది దర్శకుడు కొరటాలతో పాటు ఎవరికీ క్లారిటీ లేదు.