సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నితిన్ చేస్తున్న సినిమా భీష్మ. గతంలో హారిక హాసినిలో అ..ఆ సినిమా చేసిన నితిన్, మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్ కు చెందిన సితార లో చేస్తున్నాడు. రష్మిక మడొన్నా కథానాయక. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన పాటలు, ఇతర పబ్లిసిటీ మెటీరియల్ అంతా కలిసి, ఈ సినిమా మీద ఒక ఇమేజ్ తెచ్చాయి. భీష్మ అనే టైటిల్, సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ కూడా అలాగే వున్నాయి.
కానీ సినిమాలో ఫన్ ఫిల్డ్ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటు ఓ మెసేజ్ కూడా వుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా పాపులర్ అయింది. రైతుల సమస్యలు అదే టైమ్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రయారిటీ,యూత్ లో ఫార్మింగ్ మీద ఆసక్తి ఇవన్నీ లేటెస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ ను భీష్మలో అంతర్లీనంగా డీల్ చేసారు.
అయితే మరీ అలా అని చెప్పి, ఉపన్యాసాలు గట్రా ఇవ్వకుండా, యూత్ ను ఫార్మింగ్ వైపు, ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు దృష్టి సారించే విధంగా మంచి మెసేజ్ ను భీష్మకు జోడించినట్లు తెలుస్తోంది. స్వరసాగర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు వచ్చాయి. మూడూ బాగానే ఆకట్టుకుంటున్నాయి.