ఎప్పుడూ ప్లానింగ్‌తో సినిమాలు విడుదల చేసే సురేష్‌బాబు లెక్క ఈసారి తప్పింది. భీమవరం బుల్లోడి సినిమాని విడుదల చేయలేక, ల్యాబులో ఉంచుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారాయన. గతనెలలోనే భీమవరం బుల్లోడు బయటకు రావాలి.కానీ పెద్ద సినిమాలున్నాయని, కాస్త ఆలస్యంగా సినిమాని విడుదల చేస్తే.. డబ్బులు గిట్టుబాటు అవుతాయని ఆగారు.
అలా ఆగడంతో బుల్లోడికి ముప్పొచ్చింది. ఈనెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా భీమవరం బుల్లోడు సినిమాని విడుదల చేయాలని సురేష్ బాబు నిర్ణయించుకొన్నారు. అయితే.. ఇప్పుడది సాధ్యం కావడం లేదు. ఈ సినిమా 14న రావడం లేదట. శివరాత్రి సందర్భంగా ఈనెల 28న విడుదల చేయాలని చిత్రబృందం తాజాగా నిర్ణయించుకొంది.
ఆ రోజు… సునీల్ పుట్టిన రోజు కూడా. సీమాంధ్రలో పరిస్థితులు బాగోకపోవడం వల్లే ఈ చిత్రాన్ని వాయిదా వేశారట. శివరాత్రి నాటికి మారితే సరే సరి. లేదంటే.. మరోసారి వాయిదా తప్పదు.