మహేష్‌బాబు, శ్రీనువైట్ల సినిమా ఆగడు.. చకచక ముందుకు సాగుతోంది. ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం కృషి చేస్తోంది. ఈలోగా ఈ సినిమా గురించిన క్లూ ఒకటి మీడియాకు దొరికింది. బాలీవుడ్ చిత్రం స్పెషల్ ఛబ్బీస్ స్ఫూర్తిగా ఈసినిమా తెరకెక్కతోందని సమాచారమ్.
అందులో కథానాయకుడు నకిలీ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా నటించాడు. ఇందులో మహేష్ బాబు నకిలీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నాడని సమాచారమ్. దూకుడులో మహేష్ పోలీస్ ఆఫీసర్. కానీ… ఎమ్మెల్యేగానూ, దర్శకుడిగానూ నటించాల్సివస్తుంది. ఇందులో కూడా మహేష్‌బాబు వివిధ గెటప్పుల్లో కనిపిస్తాడట.
అదంతా వినోదం పంచడానికే అని చిత్రబృందం చెబుతోంది. సినిమాలో ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్ నేపథ్యంలోనే సాగుతుంట. మరి ఆగడు కథ వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలుసుకోవాలంటే మాత్రం.. ఆగడు వచ్చే వరకూ ఆగాల్సిందే.