లక్‌ కలిసొస్తే మహేష్‌తో!

‘హార్ట్‌ ఎటాక్‌’ ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా వచ్చినా కానీ తర్వాత బాగా డ్రాప్‌ అయింది. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్‌గా యావరేజ్‌ స్టేటస్‌తో సరిపెట్టుకుంటుందని ట్రేడ్‌ రిపోర్ట్‌. ఈ చిత్రంతో పరిచయం అయిన అదా శర్మ…

‘హార్ట్‌ ఎటాక్‌’ ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా వచ్చినా కానీ తర్వాత బాగా డ్రాప్‌ అయింది. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్‌గా యావరేజ్‌ స్టేటస్‌తో సరిపెట్టుకుంటుందని ట్రేడ్‌ రిపోర్ట్‌. ఈ చిత్రంతో పరిచయం అయిన అదా శర్మ మాత్రం టాలీవుడ్‌ దృష్టిలో పడగలిగింది. 

పూరి జగన్నాథ్‌ని మూడేళ్ల నుంచీ పీడిస్తుంటే చివరకు ఈ సినిమాలో ఛాన్స్‌ ఇచ్చాడట. ఇలా అయినా తన సౌత్‌ కెరీర్‌ స్టార్ట్‌ అయినందుకు అదా శర్మ సంతోషిస్తోంది. ఈ పునాది మీద కెరీర్‌ నిర్మించుకోవాలని ఆమె ఆశ పడుతోంది. అయితే అందుకు కావాల్సిన బూస్ట్‌ మాత్రం ఆమెకి ఏదైనా స్టార్‌ సినిమాలో ఆఫర్‌తోనే రావాలి. 

ఆ బాధ్యత కూడా పూరి జగన్నాథే తీసుకోవాల్సి వస్తుందేమో మరి. ఇప్పటికీ పూరి ఆఫీస్‌ చుట్టే ప్రదక్షిణలు చేస్తున్న అదా శర్మ అతని తదుపరి చిత్రంలో అవకాశం కోసం చూస్తోంది. మహేష్‌తో పూరి తీసే సినిమాలో తనకి చోటు కల్పిస్తే ఇక్కడ పర్మినెంట్‌గా సెటిల్‌ అయిపోవచ్చని అదా చూస్తోంది. మరి అంత అదృష్టానికి అదా నోచుకుంటోందో లేదో వేచి చూడాలి.