రాజమౌళి విజయాల్లో కీలక పాత్ర పోషించారు.. విజయేంద్రప్రసాద్. తండ్రిగా తన తనయుడికి అదిరిపోయే కథల్ని అందించారు. రాజన్న సినిమాతో దర్శకుడిగా మారినా, ఆ ప్రయత్నం బెడసి కొట్టింది. ఇప్పుడు పూర్తి స్థాయి కథారచయితగా దృష్టిపెట్టారు.
ఇప్పుడాయనకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ఇటీవలే విజయేంద్రప్రసాద్ సల్మాన్ ఖాన్‌కి కథ చెప్పారట. అదో యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలిసింది. కథ విన్న వెంటనే సల్మాన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారని సమాచారమ్. అయితే… ఈ సినిమాకి దర్శకుడు విజయేంద్ర ప్రసాదా? మరొకరా?? అనేది తెలియాల్సివుంది.
అంత అదిరిపోయే కథ అయితే.. రాజమౌళి దీన్ని ఎలా వదులుకొన్నాడో..? త‌్వరలోనే ఈ హిందీ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.