భీమినేని శ్రీనివాసరావు, అల్లరి నరేష్ అంటే సుడిగాడు సినిమా గుర్తుకువస్తుంది. బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ అది. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి ఆ ఇద్దరు ఫిక్స్ అయ్యారు. పలు హిట్ సినిమాలు చేసిన భీమినేని ఆ మధ్య ట్రాక్ తప్పి వేరే సినిమా చేసి ఇబ్బందిపడ్డారు. అందుకే మళ్లీ తన రూట్లోకి వచ్చేయాలని డిసైడ్ అయ్యారు. అల్లరి నరేష్ కూడా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో వున్నారు.
ఈ ఇద్దరికి ఓ ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాలని బ్లూ ప్లానెట్ బ్యానర్ ఫిక్స్ అయింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో రంగంలోకి దిగిన ఈ సంస్థ ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో ఎమ్ఎల్ఎ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్తికాగానే అల్లరి నరేష్ సినిమా స్టార్ట్ అవుతుంది.
తమిళంలో పెద్ద హిట్ అయిన ఓ చిన్న కామెడీ సినిమా ఆధారంగా తెలుగు కోసం భీమినేని మంచి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ టైలర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో నడుస్తుంది. ఇందులో కేవలం అల్లరి నరేష్ కే కాకుండా, మరో ఒకరిద్దరు టాప్ కమెడియన్లకు కూడా ఫుల్ లెంగ్త్ పాత్రలు వుంటాయని తెలుస్తోంది.