Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

భీష్మ వంటకం పూర్తి కాలేదా?

భీష్మ వంటకం పూర్తి కాలేదా?

ఛలో టీమ్ ను దాదాపుగా రిపీట్ చేస్తూ, హీరో నితిన్ తో ప్లాన్ చేస్తున్న సినిమా భీష్మ. నిర్మాత, హీరో మారారు. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరక్టర్, హీరోయిన్, డైరక్టర్ అంతా ఛలో సినిమా టీమ్ నే. ఈ సినిమా ఎప్పటి నుంచో పట్టాలు ఎక్కుతుందని వినిపిస్తోంది. కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఇంకా టైమ్ పట్టేలా కనిపిస్తోంది.

భీష్మ స్క్రిప్ట్ సెకండాఫ్ వంటకం ఇంకా జోడింపులు, తీసివేతలతో మరింత పసందుగా వుండే ప్రయత్నం ఇంకా కొన'సాగుతూనే' వున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంకా సినిమాకు ముహూర్తం కూడా చేయలేదు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి షూట్ కు వెళ్లాలని నిర్మాతలు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారి సంకల్పం.

నితిన్ అయితే ఫిబ్రవరి నుంచి గీతాఆర్ట్స్ సినిమా కూడా స్టార్ట్ చేసి, సమాంతరంగా ఫినిష్ చేస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ భీష్మ స్క్రిప్ట్ వంటకం మరింత ఆలస్యం అయితే ఆ మధ్య నాగచైతన్య సవ్యసాచి-శైలజారెడ్డి అల్లుడు వ్యవహారంలా తయారవుతుందేమో?

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?