ఎన్టీఆర్ బయోపిక్ తీయాలన్న కోరిక బలంగా బాలయ్యకు కలగడానికి కారణం, నిర్మాతల్లో ఒకరైన సిసిఎల్(ఇందూరి విష్ణు) సిద్ధంచేసిన/చేయించిన స్క్రిప్ట్. బసవతారకం అంతర్ముఖంగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించి, వాళ్ల బంధాలు, బాంధవ్యాలు, కుటుంబ వ్యవహారాలు అన్నీ పక్కాగా సెట్ చేసిన స్క్రిప్ట్ అది. అయితే అందులోకి దాదాపు 60 ఎన్టీఆర్ గెటప్ లు చేర్చడంతో తొలి కెలుకుడు ప్రారంభమైందని అనుకోవాలి.
సరే, డైరక్టర్ గా క్రిష్ వచ్చాక, కాస్త ఆశాభావం కలిగింది. బాగా వస్తోందన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పడు నిర్మాణ వ్యవహారాల నుంచి నిర్మాత ఇందూరి విష్ణును దూరంపెట్టినట్లే, స్క్రిప్ట్ ను కూడా కాస్త దూరంచేసి, కొత్త కొత్త సీన్లు చేర్చేస్తూ, ఏదేదో చేస్తున్నారని గ్యాసిప్ లు వెబ్ మీడియాలో రావడం ప్రారంభమైంది.
క్రిష్ కు వచ్చిన ఆలోచనలు ఆయన, బాలయ్యకు తట్టిన ఐడియాలు ఆయన కలిసి, మొత్తంమీద స్క్రిప్ట్ ను తమ చిత్తానికి మారుస్తున్నారన్నది వెబ్ మీడియా వార్తల సారాంశం. సమస్య ఎక్కడ వచ్చిందంటే, రెండు భాగాలుగా తీయాలని అనుకోవడం వల్ల. ఎప్పుడయితే రెండు భాగాలు అనుకున్నారో? రెండున్నర గంటల సినిమా నాలుగున్నర గంటల సినిమాగా మారింది. అంటే కావాల్సినంత చేర్చుకోవచ్చు.
అందుకే క్రిష్-బాలయ్య కలిసి యథాశక్తి సీన్ల మీద సీన్లు చేరుస్తున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఇదిలా వుంటే బయోపిక్ కు సంబంధించి లీకుల గోల ఎక్కువగా వుందని దర్శకుడు క్రిష్ కాస్త చికాకు పడుతున్నట్లు బోగట్టా. ఈమధ్య సినిమాకు సంబంధించిన ఓ కీలక టెక్నీషియన్ కు ఈ విషయంలో కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.
ఇలా అయితే తన తరువాత సినిమాలకు పనిచేయడం కష్టం అనేంత వరకు క్రిష్ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.
అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్