cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

సైరాలో అమితాబ్ పాత్ర ఇదే

సైరాలో అమితాబ్ పాత్ర ఇదే

సైరా సినిమాలో బిగ్ బి ఎలా కనిపించబోతున్నాడనే ప్రశ్న అప్రస్తుతం. ఎందుకంటే అతడి లుక్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అదే లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. కాకపోతే బిగ్ బి పాత్రకు సంబంధించి కొన్ని వివరాల్ని మాత్రం బయటపెట్టారు.

సైరా సినిమాలో గోశాయి వెంకన్న పాత్రలో కనిపించబోతున్నాడు బిగ్ బి. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గురువు పాత్ర. నరసింహారెడ్డిని తొలి స్వతంత్ర్య సమరయోధుడిగా తీర్చిదిద్దడంలో గురువుగా వెంకన్న పాత్రను అద్భుతంగా చూపించబోతున్నారు సైరా సినిమాలో. నరసింహారెడ్డికి దగ్గరుండి పెళ్లి జరిపించేది కూడా ఈ పాత్రే. దీనికి సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే బయటకొచ్చిన విషయం తెలిసిందే.

ఇక సైరా షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కీలకమైన యుద్ధ సన్నివేశాల్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్ తో కలిపి దాదాపు 2వేల మంది ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈస్ట్-ఇండియా కంపెనీ, సైరా మధ్య జరిగే యుద్ధ సన్నివేశం ఇది.

ఈ షెడ్యూల్ కోసం జార్జియాలో ఏకంగా ఓ చిన్నపాటి నగరాన్నే నిర్మించారు. 2వేల మంది ఉండడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క షెడ్యూల్ ఖర్చే 50 కోట్ల రూపాయలుగా లెక్కతేల్చారు. ప్రస్తుతం చిరంజీవితో పాటు సుదీప్, విజయ్ సేతుపతి కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.